విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sailajanath: పీసీసీకి కొత్త రక్తం: పూర్వ వైభవాన్ని తేవడమే లక్ష్యం: బాధ్యతలను స్వీకరించిన శైలజానాథ్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ శైలజానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులుగా మస్తాన్ వలి, తులసీరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు తరలివచ్చారు. వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.

తరలి వచ్చిన సీనియర్ నేతలు..

తరలి వచ్చిన సీనియర్ నేతలు..

పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాధ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులుగా మస్తాన్‌ వలి, తులసీ రెడ్డిలు నియమితులైన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వారిని నియమించింది. తాజాగా బుధవారం వారు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రులు పల్లంరాజు, కేహెచ్ మునియప్ప, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దినేష్ గుండూరావు, కేవీపీ రామచంద్రరావు తదితరులు తరలివచ్చారు.

సొంతగూటికి రావాలంటూ ఆహ్వానం..

సొంతగూటికి రావాలంటూ ఆహ్వానం..


ఈ సందర్భంగా శైలజానాథ్, తులసీరెడ్డి, మస్తాన్ వలి ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకుని రావడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని సొంతగూటికి రావాలని తాము ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలని విజ్ఙప్తి చేశారు. పాతతరం నేతలు, యువ శక్తి మేళవింపుతో ప్రదేశ కాంగ్రెస్ కమిటీకి కొత్త రక్తాన్ని నింపుతామని శైలజానాథ్ అన్నారు.

ఏ పార్టీతోనూ సంబంధం లేదు..

ఏ పార్టీతోనూ సంబంధం లేదు..


కాంగ్రెస్ ఏ ఒక్క పార్టీతోనూ సన్నిహితంగా మెలగబోదని శైలజానాథ్, తులసీ రెడ్డి తెలిపారు. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సమదూరాన్ని పాటిస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలనూ అదే దృష్టితో చూస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాష్ట్రం అథోగతి పాలవుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్థం పర్థం లేని నిర్ణయాలను తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర పురోగతికి విఘాతంలా పరిణమించాయని అన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటుపై..

మూడు రాజధానుల ఏర్పాటుపై..


వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ వికేంద్రీకరణ బిల్లు, శాసన మండలి రద్దు.. వంటి నిర్ణయాలపై పార్టీలో సంస్థాగతంగా చర్చించాల్సి ఉందని ఊమెన్ చాందీ వెల్లడించారు. ఆ తరువాతే తమ విధానమేమిటో, తమ నిర్ణయమేమిటో ప్రకటిస్తామని అన్నారు. అమరావతి ప్రాంత రైతులను నష్టం కలిగించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోకూడదని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై పార్టీలో వచ్చే రెండు, మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

English summary
Swearing in of newly appointed President and Working Presidents of Andhra Pradesh Pradesh Congress Committee at Vijaywada, Andhra Pradesh. Sake Sailajanath swearing as PCC President. Masthan Vali and Thulasi Reddy taking oath as working Presidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X