వైసీపీ చేతికి టీడీపీ బ్రహ్మాస్త్రం - సైలెంట్ ఆపరేషన్, గేమ్ ఛేంజ్...!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. సంక్షేమం ఎన్నికల అజెండాగా మారుతోంది. వైసీపీ తాము అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందనే ధీమాతో ఉంది. టీడీపీ ఇప్పటికే తమ సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇదే సమయంలో తమ సంక్షేమ పథకాలపైన ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టింది. దీనిని పసిగట్టిన వైసీపీ అలర్ట్ అయింది. అన్యాయమైన విధానాలు ఫాలె అవుతున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుకు సిద్దమైంది.

టీడీపీ కొత్త తరహా ప్రచారం:ఏపీలో ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన ఒక్కటయ్యాయి. ఎవరెవరు కలిసి వచ్చినా తాను ఈ నాలుగున్నారేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం తిరిగి అధికారం ఇస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు. దీంతో, అదే సంక్షేమం మేనిఫెస్టోతో ప్రజలను ఆకర్షించేందుకు టీడీపీ కొత్త ఎత్తులు మొదలు పెట్టింది. తాజాగా టీడీపీ ఓటర్లను ఆకట్టుకొనేందుకు చేస్తున్న విధానాలను వైసీపీ ముఖ్య నేతల సజ్జల బటయ పెట్టారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ 20 జూన్ 2024 నుంచీ మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అంటూ ఓటర్లకు కార్డులు అందిస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఓటరు కుటుంబ వివరాలు..తాము అమలు చేసే సంక్షేమం ద్వారా కలిగే లబ్ది వివరాలతో చంద్రబాబు వారికి ఖచ్చితంగా ఈ లబ్ది కలిగేలా హామీ ఇస్తూ సంతకం చేసిన కార్డును వారికి అందేలా చేస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు.

Sajjala allegated that TDP has deployed cyber thieves to steal the personal data from the public in the state

బయట పెట్టిన వైసీపీ:టీడీపీ కార్యకర్తలు.. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి డేటా తీసుకుని ఒక యాప్‌లో ఎంటర్‌ చేస్తున్నారని వివరించారు. ఓటీపీ వస్తే..క్లిక్‌ చేయమంటున్నారు. దాన్ని క్లిక్‌ చేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కార్డు వస్తోందని చెప్పుకొచ్చారు. దాంట్లో కంగ్రాట్స్‌ చెప్పి.. 2024 జూన్ నుంచి రూ. 2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారని సందేశం పంపుతున్నారు. 2024 జూన్‌నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమచేయడం ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. ఓటరు కార్డు నంబరు, మొబైల్‌నంబర్‌ తో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారని సజ్జల వెల్లడించారు. ఇది సైబర్‌ క్రైంకి కిందకు వస్తుందని సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. ఓటరు కార్డు కూడా తీసుకుని పౌరుల ప్రైవసీలోకి కూడా ఎంటర్‌ అవుతున్నారని ఆరోపించారు.

రహస్యాలను తస్కరిస్తున్నారు:ఇలా చేయటం ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని సజ్జల వివరించారు. ఇళ్లలోకి వచ్చి ప్రజల రహస్యాలను తస్కరిస్తున్నారని ఆరోపించారు. ఈ డేటాను వారు ఎందుకైనా వాడుకోవచ్చని.. బ్లాక్‌ మెయిల్‌ చేయవచ్చు..ఇంకేదైనా చేయవచ్చుని చెప్పుకొచ్చారు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్‌ ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేసారు. వాళ్ల చేతులోకి డేటా అంతా వెళ్లే డేంజర్‌ పరిస్థితి ఇది. ఇది చిన్న ప్రమాదం కాదని హెచ్చరించారు. వైసీపీ నుంచి ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసారు. చంద్రబాబు లాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సజ్జల అలర్ట్ చేసారు. దీంతో, ఇప్పుడు సంక్షేమం ఎన్నికల అజెండాగా మారుతున్న వేళ..ప్రజలు ఎవరి సంక్షేమానికి మద్దతిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+