Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఫలితాలు రిపీట్ - అక్కడే లోపం: సజ్జల విశ్లేషణ..!!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆసక్తి కర విశ్లేషణ.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. ఈ ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపైన ఉంటుందా. ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఈ వాదనతో విభేదిస్తోంది.

టీడీపీ రెండో ప్రాధాన్యత ఓట్లతో..అందునా పీడీఎఫ్ నుంచి బదిలీ అయిన ఓట్ల అంశాన్ని గుర్తు చేస్తోంది. తమ అభ్యర్దుల ఓటమికి గల కారణాలను అధ్యయనం చేస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆసక్తి కర విశ్లేషణ.

Sajjala Rama Krishna Reddy Interesting Analysis on MLC Election Results, says no need for TDP to celebrate

పీడీఎఫ్ తో ఒప్పందంతో

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాల్లో గెలిచిందని సజ్జల వివరించారు. టీడీపీ ముందుగానే పీడీఎఫ్ తో ఒప్పందం చేసుకున్న అంశాన్ని గుర్తు చేసారు. సహజంగా కమ్యూనిస్టులు, యూనియన్లు యాక్టివ్‌గా ఉంటాయ‌న్నారు. పీడీఎఫ్ తెలుగుదేశం పార్టీకి రెండో ప్రాధాన్యత ఓట్లను బదిలీ చేసిందని చెప్పారు. ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేద‌న్నారు.

2007లో ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ గెలిచినా.. 2009 సాధారణ ఎన్నికలపై ప్రభావం పడలేదనే విషయాన్ని సజ్జల గుర్తు చేసారు. రానున్న రోజుల్లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంద‌ని ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నిక అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించేది కాదని సజ్జల చెప్పుకొచ్చారు.

Sajjala Rama Krishna Reddy Interesting Analysis on MLC Election Results, says no need for TDP to celebrate

ఓటర్లను రీచ్ కాలేకపోయాం

ఈ ఎన్నికల్లో అధికార పార్టీగా వైసీపీ తొలి సారి పొల్గొందని సజ్జల పేర్కొన్నారు. పట్టభద్రులు, టీచర్స్‌ విషయంలో ప్రయోగం చేశామని చెప్పారు. టీచర్ల నుంచి మంచి ఆదరణ లభించింని... తొలిసారి పోటీ చేసినా ఆదరించారని వివరించారు. పట్టభద్రుల విషయంలో క్షేత్ర స్థాయిలోకి మా మెసేజ్‌ తీసుకెళ్లడం.. ఆ ప్రత్యేక ఓటర్లను రీచ్‌ కావడంలో కొంత ఇబ్బంది జరిగినట్టు ఉందని చెప్పారు.

ఈ ఎన్నికలు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించవన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత గేర్‌ అప్‌ అవుతామని స్పష్టం చేసారు. వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కావని...వారి అభ్యర్థులు కూడా ఎవరికీ పెద్దగా తెలియదని అభిప్రాయపడ్డారు. తమ దగ్గర ఉన్న గ్యాడ్యుయేట్లందరూ ఓట్లు నమోదు చేయించుకోలేదన్నారు.

Sajjala Rama Krishna Reddy Interesting Analysis on MLC Election Results, says no need for TDP to celebrate

అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఉండదు

పీడీఎఫ్‌ లాంటి సంస్థలు ఇలాంటి ఎన్నికల్లో మొదటి నుంచీ ఉన్నారని చెప్పారు. తాము ఇప్పుడే కొత్తగా ఈ ఎన్నికల్లోకి దిగామని చెప్పుకొచ్చారు. 2007లో వైఎస్‌ సిఎంగా ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారని సజ్జల గుర్తు చేసారు. ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దాని ప్రభావం పడలేదన్నారు.

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ నాయకత్వానికి ఎంత మద్దతు ఉందో స్పష్టంగా కన్పించిందన్నారు. ఈ ఫలితాలు ప్రజల అందరి అభిప్రాయంగా భావించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో టీడీపీ పోటీకి దిగటంతో గెలుస్తామని చెబుతోందని..సంఖ్యా బలం ఇక్కడ కీలకం అవుతుందని సజ్జల విశ్లేషించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+