వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక ఆదేశాలు- టెలికాన్ఫరెన్స్: గడువు పొడిగింపు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరో ప్రాజెక్ట్- గృహ సారథులు. వలంటీర్ల తరహాలో ప్రతి 59 ఇళ్లకు ఒక గృహ సారథిని నియమించడం దీని ఉద్దేశం. ఇప్పటికే నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీన దీని గడువు ముగియాల్సి ఉంది. తాజాగా దీన్ని పొడిగించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.

ప్రతి టీమ్‌లో కూడా ఒక మహిళా కార్యకర్త ఉండేలా దీన్ని డిజైన్ చేసింది పార్టీ నాయకత్వం. గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లతో పాటు అయిదు లక్షల 20 వేల మంది గృహ సారథులను నియమించేలా వైఎస్ జగన్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లను నియమించాలని, అందులో కూడా తప్పనిసరిగా ఓ మహిళ ఉండాలని సూచించారు. మొత్తంగా 45 వేల మంది కన్వీనర్లను అపాయింట్ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

Sajjala Rama Krishna Reddy made teleconference with YSRCP leaders over the Gruha Sarathi posts

ఈ నేపథ్యంలో- గృహ సారథులు, పార్టీ కన్వీనర్ల ఎంపిక ప్రక్రియపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, అబ్జర్వర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎంపిక ప్రక్రియ గురించి ఆరా తీశారు. సంక్రాంతి పండగ సెలవులు ఉన్నందున మెజారిటీ నియోజకవర్గాల్లో ఎంపిక ఇంకా పూర్తి కానందున- గడువును పొడిగించినట్లు ప్రకటించారు.

ఈ నెల 30వ తేదీ నాటికి ఎంపికను పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు గృహ సారథులతో మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ సారథులను 30వ తేదీ నాటికి ఎంపిక చేస్తే- వారికి శిక్షణ ఇవ్వడానికి వీలు ఉంటుందని చెప్పారు.

గృహ సారథులకు ఇచ్చే మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు పర్యవేక్షించాల్సి ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా ప్రజల వద్దకు చేర్చడంలో వలంటీర్లకు గృహ సారథులు సహకరించాల్సి ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ దిశగా వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు సజ్జల పేర్కొన్నారు.

English summary
Sajjala Rama Krishna Reddy made teleconference with YSRCP leaders over the appointments of Gruha Sarathi posts in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X