రాజధానులపై నిర్ణయం మారిందా : సజ్జల క్లారిటీ - వాట్ నెక్స్ట్..!!

ఏపీ రాజధానుల నిర్ణయంలో మార్పు వచ్చిందా. దీని పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో రాజధానుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఆర్దిక మంత్రి బుగ్గన విశాఖ ఒకే రాజధానిగా ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది. అటు సుప్రీంకోర్టులో ఈ నెల 23న ఏపీ రాజధానుల కేసు విచారణకు రానుంది. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో బుగ్గన చేసిన వ్యాఖ్యలు రాజధానుల విషయంలో కీలకంగా మారాయి. దీంతో మూడు రాజధానుల ఆలోచనలో మార్పు వచ్చిందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం సైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

బుగ్గన వ్యాఖ్యలతో ఒక్క సారిగా..

ఆర్దిక మంత్రి బుగ్గన బెంగుళూరు కేంద్రంగా కీలక వ్యాఖ్యలు చేసారు. మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ సదస్సు కు సంబంధించి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు నిర్వహించిన రోడ్ షో లో ఆయన రాజధానికి సంబంధించి కామెంట్స్ చేసారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా మూడు రాజధానులు అంటున్నారని.. విశాఖ మాత్రమే ఏపీ రాజధానిగా బుగ్గన వ్యాఖ్యానించారు.

అమరావతిలో అసెంబ్లీ ఒక సెషన్ జరుగుతుందని.. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుందని చెప్పారు. ఇక..ఈ వ్యాఖ్యలు మీడియాలో రావటంతో దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇటు సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వంలోని ముఖ్యులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో బుగ్గన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

ప్రతిపక్ష నేతగా వైయ‌స్ జగన్ ఇచ్చిన సలహాను ఆ రోజు చంద్రబాబు పెడచెవిన పెట్టార‌ని సజ్జల చెప్పారు.కేపిటల్ ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమ‌ని చెప్పారు. ఆ అధికారంతోనే నాడు చంద్రబాబు అమరావతి అన్నారని పేర్కొన్నారు. కానీ..చంద్రబాబు ఎవరితో చర్చించలేద‌న్నారు. తమ విధానంలో మార్పు లేదని తేల్చి చెప్పారు.

తమ పార్టీ..సీఎం జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కోర్టులను కాదని ముందుకు వెళ్లే అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులతో పాటుగా జగన్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మందుకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు.

విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసారు. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానులకు సంబంధించి మెరుగైన చట్టం తీసుకొస్తామని సజ్జల వెల్లడించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరుకుంటున్న వారు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా

చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా

కొన్ని రకాల ప్రచారాలతో అపోహలు కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఎవరూ అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని సజ్జల స్పష్టం చేసారు. రాజధాని అనే పేరు ఉందా లేదా అనేది ముఖ్యం కాదని..మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమని చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానంగా వెల్లడించారు.

అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిన అంశాన్ని సజ్జల గుర్తు చేసారు. ఎన్నికల కోసం ఒక విధంగా.. ఆ తరువాత మరో రకంగా మాట మార్చే విధానం తమది కాదన్నారు. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలోనే కేంద్రం రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని చెప్పిన అంశాన్ని సజ్జల గుర్తు చేసారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+