షర్మిల లక్ష్యం అదే: చంద్రబాబు అస్త్రం అంటూ సజ్జల సంచలన ఆరోపణలు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రె పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూసాకా బాధపడ్డాం.. ఇప్పుడు జాలి పడుతున్నామన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. షర్మిల వాడిన భాస, యాస సరికాదన్నారు. వైయస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. వైయస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని సజ్జల తెలిపారు. వైయస్సార్ మరణాంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురిచేసిందన్నారు.

Sajjala Ramakrishna reddy hits out at ys sharmila for her comments on ys jagan

వైఎస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ అజాదే చెప్పారని సజ్జల తెలిపారు. సోనియా గాంధీ చెబితేనే కేసు వేశానని శంకర్రావు చెప్పారని తెలిపారు. వైయస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు? అని సజ్జల నిలదీశారు. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనుకడుడు వేశారని ప్రశ్నించారు.

ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో.. అందరికీ తెలుసన్న సజ్జల రామకృష్షారెడ్డి.. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తుగడే అని వ్యాఖ్యానించారు. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుందన్నారు. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే షర్మిల లక్ష్యమని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+