జగన్ ఆ అవకాశం కోసం వెయిటింగ్ - అప్పుడే ఎన్నికలు : సజ్జల కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు - పవన్ భేటీ పైన ఆయన స్పందించారు. ఈ ఇద్దరు రహస్య సమావేశాలు ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు. 11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని పవన్ పరామర్శించటం ఏంటని సజ్జల నిలదీసారు. చనిపోయిన కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేలో పవన్ చెప్పాలన్నారు. ఎంత మంది కలిసినా తమకు మంచిదేనని సజ్జల చెప్పుకొచ్చారు. అందరినీ కలిసి ఓడించే అవకాశం కూడా జగన్ కు దక్కుతుందని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.

సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం పైనా సజ్జల స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని సజ్జల స్పష్టం చేసారు. ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించటం విచిత్రంగా ఉందన్నారు.బీజేపీ కూడా కలిస్తే వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటాయాని ప్రశ్నించారు. ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని వ్యాఖ్యానించారు. ఎంత మంది కలిసినా తమకు మంచిదేనని సజ్జల చెప్పుకొచ్చారు. అందరూ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుందని పేర్కొన్నారు. అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కోసమే జగన్ ఎదురు చూస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

Sajjala Ramakrishna Reddy interesting comments on Early poll and Chandra Babau, Pawan Kalyan meet

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు ఆషామాషీగా రాలేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును వదలించుకోవాలనే స్థితిలో నాటి ప్రభుత్వానికి ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి వైసీపీకి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లోనూ జగన్ సింగిల్ గానే పోటీ చేసారని..ఇప్పుడు సింగిల్ గానే పోటీకి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేసారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా నేరుగా ప్రజలకు అందుతున్నాయని సజ్జల విశ్లేషించారు. ఇచ్చిన హామీలను ఇప్పటికే 98 శాతం పూర్తి చేయటం అసాధారణ విషయంగా అభివర్ణించారు. తండ్రి నుంచి జగన్ ప్రజా సేవను వారసత్వంగా తీసుకున్నారని చెప్పిన సజ్జల.. ప్రజా జీవితం అంటే నిత్యం ప్రజల్లో ఉండటం అని నమ్మిన వ్యక్తి జగన్ అని సజ్జల వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+