జగన్- చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పండి..

Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భేటీలను నిర్వహిస్తోన్నారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తోన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచిస్తోన్నారు.

తాజాగా ఆయన- పార్టీ మైనారిటీ విభాగం కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉంద‌ని, 175కు 175 నియోజకవర్గాలను గెలవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించారని అన్నారు. దీన్ని సాధించడానికి అవిశ్రాంతంగా పని చేయాలని చెప్పారు.

Sajjala Ramakrishna Reddy lashes out at Chandrababu Naidu

పరీక్షలు రాసే విద్యార్థుల్లా ప్ర‌తి కార్య‌క‌ర్త‌ పని చేయాల్సిన సమయం వచ్చిందని సజ్జల అన్నారు. ఈ 50 రోజుల పాటు 175/175 టార్గెట్‌తో కృషి చేయాలని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో సునామీ వంటి ఆదరణ ఉందని, సిద్ధం బహిరంగ సభల్లో ఇది స్పష్టమైందని గుర్తు చేశారు.

ఈ ఆదరణను ఓట్లుగా మలచుకోవాలని సజ్జల సూచించారు. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేపి, వారిని గెలిపించాల సూచించారు. చంద్రబాబు 14 సంవత్సరాల పరిపాలన- అయిదేళ్ల జగన్ పరిపాలన మధ్య తేడాను ప్రజలకు వివరించాలని అన్నారు.

సంక్షేమ పాలన అందిస్తోన్న వైఎస్‌ జగనా?.. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా? అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశామని, అందుకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+