ఎగ్జిట్ పోల్స్ మిస్ అయిన కీలక ఓటింగ్ - అక్కడే ఆ పార్టీ గెలుపు..!!
ఏపీలో గెలుపు దక్కేదెవరికి. ఎగ్జిట పోల్స్ వచ్చినా ఇంకా స్పష్టత రాలేదు. పార్టీల్లో సైతం ఎగ్జిట్ పోల్స్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీల అధినేతలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక..ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కీలక అంశాన్ని మిస్ అయ్యారంటూ కీలక అంశం తెర మీదకు వచ్చింది. ఎన్నికల్లో అధికారం డిసైడ్ చేసే అంశాన్ని గుర్తించ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే ఆ పార్టీని అధికారానికి దగ్గర చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
వైసీపీకి సైలెంట్ ఓటింగ్
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడయ్యాయి. కొన్ని సంస్థలు వైసీపీకి అధికారం ఖాయమని తేల్చాయి. మరి కొన్ని సంస్థలు టీడీపీకి అనుకూలంగా అంచనాలను ప్రకటించాయి. ఈ సర్వే లెక్కల పైన వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలోసైలెంట్ ఓటింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని..కానీ, వైసీపీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని వివరించారు. వైసీపీ గెలుపు ఖాయమని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.

పల్స్ అందని సర్వే సంస్థలు
జాతీయ సర్వే సంస్థలు టార్గెట్ గా బిజెపి కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చినట్టు ఉందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో సర్వే సంస్థలు తప్పుగా లెక్కలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్న కారణంగానే ఆ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్యను పెంచినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ మీద అవగాహన ఉన్న సర్వే సంస్థల అంచనాలు వైసీపీకి క్లియర్ గా ఉన్నాయని వివరించారు. కొన్ని అంశాల్లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. కౌంటింగ్ లో ప్రభావం చూపేందుకు ఎగ్జిట్ పోల్స్ ను టీడిపి కూటమి వాడుకుంటున్నట్టు కనిపిస్తుందని చెప్పారు. ఫలితాల్లో వైసీపీకి అనూహ్య స్థానాలు వస్తాయని సజ్జల విశ్వాసం వ్యక్తం చేసారు.
వైసీపీ గెలుపు పక్కా
వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల కీలక సూచనలు చేసారు. వైసీపీకి పడిన ప్రతీ ఓటు కౌంట్ అయ్యేలా చూడాలని నిర్దేశించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్దులు కుట్రలకు దిగే అవకాశం ఉందని..ఎక్కడా సంయమనం కోల్పోవద్దని సూచించారు. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటూ ఏ తప్పు జరిగినా అధికారులకు నివేదించాలని పేర్కొన్నారు. ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని సజ్జల ధీమా వ్యక్తంచేసారు. వైసీపీకి గ్రామీణ ఓటర్లు, మహిళలు అండగా నిలిచారని...ఎగ్జిట్ పోల్స్ లో సంస్థలకు అంచనాలు సరిగ్గా అందలేదనే అభిప్రాయం వైసీపీ ముఖ్య నేతల్లో వ్యక్తం అవుతోంది. దీంతో..జూన్ 4న కౌంటింగ్ లో తమకు పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications