సరైన సమయంలో సరైన నిర్ణయం - సజ్జల..!!

రుషికొండలో పవన్‌ కల్యాణ్‌ విన్యాసాలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే పవన్‌ స్పీచ్‌లో ఏమందని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని సజ్జల వ్యాఖ్యానించారు.

యజమాని డైరెక్షన్‌లోనే
పవన్ తన యజమాని డైరెక్షన్‌లోనే పవన్‌ మాట్లాడుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. నాడు వద్దన్న సీబీఐని ఇప్పుడు చంద్రబాబు కావాలంటున్నారని ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం ఇస్తారని వ్యాఖ్యానించారు.రిషికొండలో చట్టాలు ఉల్లంఘించి నిర్మాణాలు సాధ్యం కాదన్నారు. రిషికొండలో ఉల్లంఘనలు చేసి నిర్మాణాలు చేస్తే సీఎం జగన్ కు ఏం వస్తుందని సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వంపై పద్దతి ప్రకారం బురదజల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు చట్టాలు, రాజ్యాంగం వర్తంచవన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Sajjala Ramakrishna Reddy

తప్పుడు ప్రచారాలు
వారు చేసే తప్పులు ప్రశ్ని తమ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. పుంగనూరులో పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలీసులు సంయమనం పాటించడంతో ముప్పు తప్పిందని, ప్రచారం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టించారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేసారు. రజనీకాంత్, చిరంజీవి మాట్లాడిన అభిమానుల కేరింతలు వస్తాయని.. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆవేశ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అంగళ్లులో పోలీసుల కాల్పులు జరగాలని చంద్రబాబు కోరుకున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. అధికారం నా హక్కు, నేనే అర్హుడిని అని చంద్రబాబు అనుకుంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు చెప్పగలరా
పవన్‌కు తాను గెలవాలని లేదని... చంద్రబాబును గెలిపించాలని తప్ప అని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించింది కూడా గాజువాక ప్రజలే అని చెప్పుకొచ్చారు. ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజు నుంచే ఆమెతో తమకు బంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అద్బుతంగా సాగుతోందన్నారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా అని సజ్జల సవాల్ చేసారు. వైసీపీ పాలన పైన మాట్లాడానికి చంద్రబాబుకు అంశాలు లేవన్నారు. పథకాలు అమలవుతున్న తీరుపై ప్రజల్లో సంతృప్తి ఉందని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+