చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య అదే, అమిత్ షా ఫోన్ కలరింగే: సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పచ్చమీడియా ద్వారా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బద్నాం చేయడమే చంద్రబాబు పని, ఏకైక విద్య అదే: సజ్జల
చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే రాజకీయాలకు ప్రజలు, ప్రజా జీవితాలు, ప్రజల సమస్యలతో సంబంధమే ఉండదన్నారు. అయితే రాష్ట్రపతి పాలన లేదంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రపతి పాలనపై రాష్ట్రపతి ఏమన్నారో ఏమో కానీ... టీడీపీ నేతలు చెప్పాల్సింది చెప్పారు.. కక్కాల్సింది కక్కారని సజ్జల విమర్శించారు.

చంద్రబాబు ఏపీ ప్రతిష్టను దిగజార్చారు: సజ్జల ఫైర్
ఢిల్లీ పర్యటనలో అమిత్ షా అపాయింట్‌మెంట్ గురించి ప్రస్తావనే లేదని.. అసలు అమిత్ షాకు చంద్రబాబు ఏం ఫిర్యాదు చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఫిర్యాదు చేసినా అమిత్ షా రాష్ట్రంపై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు మీడియాను ఆకర్షించగలిగారు.. కానీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని సజ్జల విమర్శించారు. ఏపీ డ్రగ్స్‌కు రాజధానిగా ఉందని చంద్రబాబు చెప్పడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమేనని మండిపడ్డారు. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబుపై కేసు పెట్టి శిక్ష విధించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్న చంద్రబాబే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని.. ఈ ఉగ్రవాదాన్ని ఏమనాలో కూడా తమకు అర్థం కావడం లేదని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Recommended Video

అమిత్ షా ఫోన్ చేశారంటూ చంద్రబాబు కలరింగ్: సజ్జల
మళ్లీ అమిత్ షా ఫోన్ చేశారంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆయనకు ఏ అమిత్ షా ఫోన్ చేశారో తమకు తెలియదని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో ఏ అమిత్ షాతో మాట్లాడారో.. ఇవాళ ఏ అమిత్ షాతో మాట్లాడారో చంద్రబాబుకే తెలియాలన్నారు. బూతులు తిట్టిన వాడు మాల్దీవుల్లో ఉన్నాడని.. తిట్టించిన చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో కూర్చున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. తనకు ఓటు వేయని రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఏపీ పరువు తీసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని అన్నారు. అబద్ధాలు ప్రొజెక్ట్ చేయడంలో చంద్రబాబుకు మించినవాళ్లులేరని అన్నారు. ఎయిడెడ్ స్కూళ్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో జరిగిన ఆందోళనల్లో టీడీపీ పార్టీ ప్రమేయం ఉందని సజ్జల మండిపడ్డారు.












Click it and Unblock the Notifications