చంద్రబాబు ర్యాలీ తప్పు- కాదు కరెక్టే- సజ్జల వర్సెస్ అచ్చెన్నాయుడు...

ఏపీలో స్కిల్ స్కాంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విపక్ష నేత చంద్రబాబు నిన్న రాజమండ్రి జైలు నుంచి ఉండవల్లి వరకూ సుదీర్ఘంగా 14 గంటల పాటు ర్యాలీగా తరలివచ్చారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో మొదలైన ఈ ర్యాలీ ఇవాళ తెల్లవారు జామున ఐదున్నర గంటలకు ఉండవల్లి చేరుకుంది. ఆ తర్వాత ఈ ర్యాలీపై వైసీపీ వర్సెస్ టీడీపీ మాటల యుద్ధం మొదలైంది. ముందుగా చంద్రబాబు ర్యాలీని తప్పుబడుతూ వైసీపీ నేత సజ్జల ఘాటుగా స్పందించారు.

హైకోర్టు స్పష్టంగా చెప్పినా చంద్రబాబు నిబంధనలు అతిక్రమించి ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేత సజ్జల ఆక్షేపించారు. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు అని కోర్టు బెయిల్ ఇచ్చిందని,అత్యవసరంగా చికిత్స చేయకపోతే ఇబ్బంది అవుతుందని కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. కోర్టు మానవతా ధృక్పధంతో బెయిల్ ఇచ్చి చికిత్స చేయించుకోమని చంద్రబాబుకు చెప్తే... ఆయన రాజమండ్రి నుంచి ఎలా వచ్చారో అందరూ చూశారన్నారు. మీడియా ఫోకస్ కోసం తరలించిన టీడీపీ శ్రేణులతో రోడ్లపై చంద్రబాబు హడావుడి చేశారన్నారు. రోగి అని బెయిల్ తెచ్చుకుని చంద్రబాబు గన్నవరం 14 గంటలు ఎలా వచ్చారు. ఇది మోసం, వంచన కాదా అని ప్రశ్నించారు.

sajjala ramakrishna reddy versus atchannaidu over chandrababus 14hour long rally

దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు కౌంటర్ఇచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందుకని ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపరమేధావిని అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఫీలవుతున్నారన్నారు. నిన్న చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారని, కోర్టు నిబంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+