వివేకా కేసులో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే - సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదన్నారు. సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేసారు. ఈ కేసులో ఆదినారాయణరెడ్డి, బీటెక్‌రవికి సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారనన్నారు. శివశంకరరెడ్డి కూడా తప్పు చేయలేదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వివేకానందరెడ్డి అజాత శత్రువని. వివేకా చుట్టూ నేరప్రవృత్తి కలిగిన మనుషులున్నారన్నారు. వివేకా కుటుంబంలోనూ విభేదాలున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు.

సీబీఐ ప్రకటనల వెనుక రాజకీయం
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సీఎం జగన్ ను టార్గెట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఉందని సజ్జల పేర్కొన్నారు. జగన్ కుటుంబానికి వివేకానందరెడ్డి తో అవినాభావ సంబంధముందని చెప్పారు. వివేకానందరెడ్డి విజయమ్మపై పోటీ చేసినా, ఆ తర్వాత ఆయన వైసీపీ లోకి వస్తానంటే సాదరంగా జగన్ ఆహ్వానించారని గుర్తు చేసారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అవినాష్‌రెడ్డి కి ఒక తండ్రిలా సలహాలు ఇచ్చేవారని చెప్పారు. టీడీపీ, చంద్రబాబు లైన్‌కు అనుగుణంగా సీబీఐలో కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారని సజ్జల ఆరోపించారు. నిష్పక్షపాతంగా వారు పనిచేయకపోగా, కల్పిత వాంగ్మూలాలను సృష్టించి , జగన్ పై వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ ప్రకటనల వెనుక రాజకీయ ప్రమేయముందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ పై కుట్రలు
ఈ కేసును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ పై కుట్రలు చేస్తున్నారని సజ్జల అనుమానం వ్యక్తం చేసారు. రాబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి నిందలు వేస్తే, వక్రీకరణలు చేస్తే ఆ ఎన్నికల్లో ఓట్లు పడతాయనే దురాశతో, కుట్రతో ఇంతగా చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిచుట్టూ రాజకీయాలు చేయడం, దీన్నుంచి లబ్ధిపొందాలని బాబు చూడడం రాష్ట్ర రాజకీయ దౌర్భాగ్యంగా పేర్కొన్నారు. సంఘటన జరిగిన తర్వాత శివప్రకాష్‌రెడ్డి (వివేకానందరెడ్డి బావమరిది), అక్కడ దొరికిన లేఖ అనుమానాస్పదంగా ఉందని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి తనకు ఫోన్ చేసి, గుండెపోటుతో బావ చనిపోయారని ఆదినారాయణ రెడ్డి చెప్పారని వివరించారు. వివేకా హత్య కేసులో బాబుదే మాస్టర్ మైండ్ గా సజ్జల ఆరోపించారు.

కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు
వివేకా హత్య కేసును పక్కదారి పట్టించడానికి అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, భారతమ్మ పేర్లను ప్రస్తావించడం కుట్రపూరితమని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కేసులోనూ బీజేపీలో కోవర్టులుగా ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు ఇన్‌ఫ్లుయన్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం.. జగన్ పై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు. పట్టాభి అనే వ్యక్తి గన్నవరం పోకపోతే కొట్లాటలు లేవన్నారు. దాడులు లేవు. అక్కడ ఎదురెదురు పడిన రెండు పార్టీల వ్యక్తులు దాడులకు దిగినప్పుడు పట్టాభిని రక్షించింది పోలీసులని సజ్జల చెప్పారు.జగన్ మౌనంగా అన్నీ సహిస్తున్నారు కాబట్టే... లోకేశ్, బాబు, పవన్‌కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. గన్నవరంలో అల్లర్లకు కారణం చంద్రబాబేనని సజ్జల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications