ఎన్నికల వేళ సింపతీ రాజకీయం..!!

సీఎం జగన్ పైన దాడి సంచలనంగా మారింది. దాడి పైన కూటమి నేతలు ఒక్కొక్కొరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ దాడి జరిగిన వెంటనే సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. సీఎంలు మమతా, స్టాలిన్ దాడిని ఖండించారు. పవన్ కల్యాణ్ ఇదంతా డ్రామాగా పేర్కొన్నారు. దాడి తరువాత జగన్ తిరిగి బస్సు యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు సభలోనూ రాయి పడింది. ఎన్నికల్లో సింపతీ రాజకీయం పైన విమర్శలు మొదలయ్యాయి.

సజ్జల వ్యాఖ్యలు
జగన్ పైన దాడి..ప్రతిపక్షాల విమర్శల పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల స్పందించారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి వాళ్లు భయపడుతున్నారని.. దోషులెవరో విచారణలో తెలుస్తుందన్నారు. నింద తమపైకి వస్తుందని టీడీపీ భయపడుతోందన్నారు. ఎవరైనా తమపై తాము దాడి చేయించుకుంటారా..? అంటూ డ్రామాలంటున్న విపక్షనేతలకు సజ్జల కౌంటర్లు వేశారు. భద్రతా వైఫల్యం అంటున్నారు.. ఏం వైఫల్యమో చెప్పరు.. అంటూ పేర్కొన్నారు. డ్రామా అని టీడీపీ చెప్పడం వెనుక వారి భయం కనిపిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పుట్టి మునిగిందని అర్థమైపోయిందని.. అందుకే.. ఇలాంటి ప్రచారం చేస్తుందన్నారు.

Sajjala slams TDP Chief Chandra Babu made key comments on Pawan Kalyan

టీడీపీ విమర్శల పై
సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో భయం పట్టుకుందని.. సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. భద్రతా వైఫల్యం అంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో తెలియదన్నారు. దాడి ఘటనలో బాధితులం మేము.. సీబీఐ విచారణ వాళ్లు కోరుతన్నారని చెప్పుకొచ్చారు. జగన్‌కు డ్రామాలు తెలీదని.. ఉద్దేశపూర్వకంగా కావాలనే దాడి చేయించుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Sajjala slams TDP Chief Chandra Babu made key comments on Pawan Kalyan

జగన్ యాత్ర ప్రారంభం
చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలోనూ రాయి పడింది. పవన్ కల్యాణ్ తెనాలి సభలోనూ రాయి పడిందనే ప్రచారం జరిగింది. చంద్రబాబు సీఎం జగన్ పైన దాడిని ఖండించారు. పవన్ మాత్రం దాడి పైన సందేహాలు వ్యక్తం చేసారు. దాడి జరగిందో లేదో అంటూ వ్యాఖ్యానించారు. దాడి పైన స్పందించిన జగన్ ఇలాంటి దాడులను భయపడేది లేదని చెప్పారు. ధైర్యంగా అడుగు ముందుకు వేద్దామని సూచించారు. ఎన్నికల్లో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. బస్సు యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+