బకరా కావాలని 'సాక్షి', బాబు 30 మందితో మాట్లాడారని కేసీఆర్!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో మీడియాలో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో సంచలన కథనాలు వచ్చాయి.
బాస్‌కూ ఒక బకరా రావాలని ఏపీలో కథనం వచ్చింది. ఓటుకు నోటులో బలి పశువు కోసం అన్వేషిస్తున్నారని, 15 రోజులుగా అధికారులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని రాసింది. బాస్ స్థానంలో మరొకరిని ప్రవేశ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.

తెలంగాణ టీడీపీ నేతతో స్వచ్ఛంధ అంగీకార వాంగ్మూలం ఇప్పించే వ్యూహం రచిస్తున్నారని, అలా చేస్తే ఎదురు దెబ్బ తగలవచ్చని అధికారులు కూడా సూచించినట్లు రాసింది. స్టీఫెన్ సన్‌తో ఫోన్ సంభాషణను తెరాస పైన తోసేయాలని ఆంతరంగికులు సలహా ఇచ్చారని కూడా రాసింది.
గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు కుట్ర చేశారని కేసీఆర్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోందని పేర్కొంది.
30 మంది ఎమ్మెల్యేలతో స్వయంగా బేరసారాలు జరిపారని కేసీఆర్ చెప్పారని రాసింది. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో సెక్షన్ 8 అంటూ మాట్లాడుతూ, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పినట్లుగా రాసింది.












Click it and Unblock the Notifications