ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: టాలీవుడ్ ప్రేక్షకులను తన విలక్షణమైన నటనతో అలరిస్తున్న నటుడు సంపూర్ణేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంపూర్ణేష్‌బాబును ప్రత్యేకంగా ఆహ్వానించింది.
దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంపూర్ణేష్ బాబు.. ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం వారికి నా నమస్సులు' అంటూ ట్వీట్ చేశాడు.
Krishna Pushkaralaku Aahwaninchina Andhra Pradesh prabhuthvam vaariki naa namassulu... pic.twitter.com/tJq8aYBbyu
— Sampoornesh Babu (@sampoornesh) 7 August 2016
తొలి చిత్రం 'హృదయకాలేయం'తో అభిమానుల హృదయాలను గెలుచుకున్న సంపూర్ణేష్ బాబు.. ప్రస్తుతం 'కొబ్బరిమట్ట' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
కాగా, ఏపి ప్రభుత్వం నుంచి పలువురు సినీ ప్రముఖులకు కూడా పుష్కర ఆహ్వానాలు అందాయి. కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపి ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications