టీడీపీ హాయంలో ఇసుక1200 ఇప్పుడు 10000 : చంద్రబాబు నాయుడు
వైసిపి రివర్స్ టెండరింగ్ తోనే ఉచిత ఇసుక యూనిట్ ధరను అమాంతం పెంచిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. టీడీపీ హయంలో ఇసుక యూనిట్ ధర 1200 రుపాయలు ఉంటే వైసీపీ దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో యూనిట్ ధరను పదివేల రూపాయలు చేసిందని చంద్రబాబు విమర్శించారు. దీంతో వైసీపీ నేతలు ఇసుక నుండి తైలం తీయగల సమర్ధులని నిరూపించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలోనే వైసిపీ ప్రభుత్వం ధన దాహంతో లక్షల మంది భవన కార్మికులను రోడ్డున పడేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇసుకను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో ఇసుకను కృత్రిమ కొరత సృష్టిస్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా భవన కార్మికులకు అండగా ఉండేందుకు నిరసనలు చేపట్టిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయాడాన్ని ఆయన ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.

ఇసుక కొరతతో చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే..దీంతో ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ చేసిన ధర్నాపై మంత్రి బోత్స సత్యనారయణ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారని విమర్శించారు. ఇసుక నుండి ఆదాయం కోల్పోతున్నామనే ఆందోళనతో నే నిరసనలకు దిగారని దుయ్యాబట్టారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!