హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రష్.. టోల్ గేట్ల వద్ద పరిస్థితి ఇలా!!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో తెలుగు రాష్ట్రాల్లో బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలలో సెటిల్ అయిన, ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు తమ తమ స్వగ్రామాలకు ప్రయాణాలు సాగిస్తారు. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది కూడా సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రోజువారి సర్వీసులలో సీట్లన్నీ నిండిపోవడంతో, ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ కొనసాగుతోంది.

ఆర్టీసీ పెట్టిన ప్రత్యేక బస్సులు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులలో సైతం ప్రస్తుతం రద్దీ కనిపిస్తుంది. ఈ సారి పండుగను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చెయ్యాలని భావిస్తున్న క్రమంలో జోరుగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి టోల్ గేట్ ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 53000 వాహనాలు రాకపోకలు సాగించాయని తెలుస్తుంది.
గతేడాది కంటే ఈసారి వాహనాల రద్దీ మరింత పెరిగిందని తెలుస్తుంది. కానీ ఫాస్టాగ్ తో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నేపధ్యంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్య నెలకొంది. కానీ గతంలా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితి లేదు. మరోవైపు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాలలో రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కొనసాగుతున్న రద్దీ నేపథ్యంలో apsrtc ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసి పండుగకు ప్రయాణికులు వారి వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు కృషి చేస్తోంది.
-
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications