'ఏం లాభం... బాబాయ్‌ని గెలిపించుకోలేకపోయారు', 'జగన్ అతి వల్లే'

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: సొంత పార్టీ నేతలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదని, ఇందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం అని మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 500 మందికి పైగా ఎంపీటీసీల మద్దతు ఉండి జగన్‌ తన సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకోలేక పోయారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల దాకా... సీనియర్ల వరుస షాక్: జగన్ తీరే కారణమా?

Sathish Reddy challenges YS Jagan

వైసిపి తరఫున గెలిచిన ఎంపీటీసీలు వివేకాకు ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్‌ తెలుసుకోవాలని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు తామే గెలుస్తామని మాట్లాడిన జగన్‌.. ఓడిపోయాక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు లేదని చెబుతున్న జగన్‌ ధైర్యం ఉంటే కడప పార్లమెంట్‌, పులివెందుల శాసనసభ స్థానాలకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సతీశ్ రెడ్డి సవాల్‌ విసిరారు.

ఆయన అతి నాకు కలిసి వచ్చింది: బీటెక్ రవి

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరఫున గెలుపొందిన బీటెక్‌ రవి మీడియాతో మాట్లాడారు. జగన్‌పై నమ్మకం లేకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. జిల్లాలో నాయకుల సమష్టి కృషివల్లే తాను గెలిచానన్నారు.

తనపై నమ్మకం ఉంచి సీటు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ అతిగా స్పందించడం తమకు కలిసి వచ్చిందన్నారు. కడప జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Sathish Reddy on Monday challenged YSR Congress Party chief YS Jaganmohan Reddy after MLC Elections results.
Please Wait while comments are loading...