పులివెందుల టీడీపీలో కొత్త రచ్చ - సతీష్ రెడ్డి కీలక నిర్ణయం : బీటెక్ రవికి చెక్..!!
ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రతిపక్ష టీడీపీలో కొత్త రచ్చ మొదలైంది. 2019 ఎన్నికల తరువాత అప్పటి నుంచి పార్టీ ఇంఛార్జ్ గా.. వైఎస్సార్ కుటుంబం పైన పలు మార్లు పోటీ చేసి ఓడిన మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి టీడీపీని వదిలి దూరంగా ఉంటున్నారు. దీంతో..ఎమ్మెల్సీ బీటెక్ రవికి ప్రాధాన్యత పెరిగింది. కొద్ది రోజుల క్రితం బీటెక్ రవి పులివెందుల ఇంఛార్జ్ గా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగినా..స్థానిక కారణాలతో ఆయన వైసీపీ లో చేరలేదు. అప్పటి నుంచి రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు.

సతీష్ రెడ్డి టీడీపీలో యాక్టివ్ అవుతారా
ఈ సమయంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు సతీష్ రెడ్డితో భేటీ అయ్యారు. వారంతా బీటెక్ రవికి వ్యతిరేకంగా సతీష్ రెడ్డిని కలిసినట్లు ప్రచారం సాగుతోంది. బీటెక్ రవి ఇబ్బందులు పెడుతున్నారని..రవిని నమ్మితే నట్టేట మునుగుతామంటూ సతీష్ రెడ్డి వద్ద వాపోయారు. సతీష్ రెడ్డి తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని వారంతా కోరారు. అయితే, సతీష్ రెడ్డి వారితో తన మనసులోని ఆవేదన షేర్ చేసుకున్నారు. తాను టీడీపీ కోసం 30 ఏళ్లు పని చేశానని చెప్పుకొచ్చారు.

పార్టీ ఇంఛార్జ్ గా ఛాన్స్ ఇస్తేనే
తనను చంద్రబాబు, లోకేశ్ తనను శంకించారని, తాను అమ్ముడుపోయినట్టుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసారు. తాను ఎన్ని ఇబ్బందులు పడినా..పార్టీ కేడర్ ను మాత్రం ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసానని చెప్పుకొచ్చారు. తాను తిరిగి టీడీపీలో చేరాలంటే తనను మరలా పులివెందుల ఇన్‌చార్జిగా నియమిస్తే పార్టీలో చేరుతానని సతీష్ రెడ్డి తేల్చి చెప్పారు. దీనికి నియోజకవర్గంలోని పార్టీ నేతలు సైతం సమ్మతించారు. ఆ విషయం పైన తాము పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి చర్చలు చేస్తామని చెప్పారు.

చంద్రబాబు మొగ్గు ఎవరి వైపు
టీడీపీని కాదనుకొని వెళ్లి పోయిన సతీష్ రెడ్డిని టీడీపీ నేతలు కలవటం పైన బీటెక్ రవి వర్గం ఆగ్రహంతో ఉంది. దీని పైన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పైన పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు బీ టెక్ రవి వర్గం సిద్దం అవుతున్నట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు 30 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబం పైన టీడీపీ నుంచి రాజకీయంగా పోరాటం చేస్తున్న సతీష్ రెడ్డి తాను తిరిగి టీడీపీలోకి రావాలంటే కండీషన్ పెట్టటం..దీనికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న నేతలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్త కరంగా మారుతోంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications