మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత..! ప్రముఖుల సంతాపాలు..!
ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (Satrucharla Vijaya Rama Raju ) ఇవాళ కన్నుమూశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న విజయరామరాజు.. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్న శత్రుచర్ల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 78 ఏళ్ల శత్రుచర్ల విజయరామరాజు ఇవాళ విశాఖపట్నంలో కన్నుమూశారు. 1949లో విజయనగరం జిల్లా చినమేరంగిలో చన్మించిన ఆయన ఆంధ్రాయూనివర్సిటీ నుంచి పీజీ చేశారు. అనంతరం 1978లో జనతాపార్టీతో రాజకీయ అరంగేంట్రం చేశారు. శత్రుచర్ల ఒకసారి జనతా పార్టీ నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. పాత నాగూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, ఒకసారి పార్వతీపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1989, 91లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలిచారు.

అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ప్రభుత్వాల్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా కూడా శత్రుచర్ల విజయరామరాజు పోటీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో టీడీపీలో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. టీడీపీలో పాతపట్నం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా శత్రుచర్ల ఉండగానే.. ఆయనకు ప్రత్యర్దిగా ఉన్న ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు చెక్ పెట్టేందుకు అప్పట్లో మరో నేత కలమట మోహనరావును పార్టీలోకి తెచ్చారు. 2017లో స్ధానిక సంస్ధల నియోజకవర్గాల కోటాలో శత్రుచర్ల ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఎమ్మెల్సీగా రిటైర్ అయిన తర్వాత శత్రుచర్ల ఎక్కువగా యాక్టివ్ గా లేరు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న శత్రుచర్ల మరణంపై ఉత్తరాంధ్రలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
