విజయసాయిరెడ్డి పార్టీలో తొలి చేరిక..! టీడీపీలో తొలి వికెట్..! 11 ట్రోల్స్ పై క్లారిటీ..!

ఏపీలో కూటమి, వైసీపీకి వ్యతిరేకంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి (Vijayasai Reddy) ఇవాళ ఓ గుడ్ న్యూస్ లభించింది. టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న ఓ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, సాయిరెడ్డి కొత్త పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీంతో ఇన్నాళ్లూ సాయిరెడ్డి తప్ప మరో మొహం కనిపించని ఆయన ప్రెస్ మీట్లలో తొలిసారి మరో నేత దర్శనమిచ్చారు.

ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!

గతంలో టీటీడీ బోర్డులో విజయసాయిరెడ్డితో పాటు కలిసి పనిచేసిన టీడీపీ నేత ఓవీ రమణ (OV Ramana) ఇవాళ తన సొంత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. విజయసాయిరెడ్డి స్థాపించనున్న కొత్త పార్టీలో తాను చేరనున్నట్లు ప్రకటించారు. విజయసాయిరెడ్డికి అండగా నిలుస్తానని ఓవీ రమణ వెల్లడించారు. దీనిపై సాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ అభివృద్ధి లో తాము భాగస్వామ్యం తో సమర్ధవంతంగా పని చేశామనే ఆత్మ సంతృప్తి ఉందని, 11-11-2026 న నేను ప్రకటించే పార్టీ లో రమణ చేరాలని నిర్ణయించడం చాలా సంతోషమని తెలిపారు.

TDP Leader OV Ramana to Join Vijayasai Reddy s New Political Party Both Share TTD Board Association
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!

తాను వైసీపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా సెక్రటరీగా పని చేశానని, కాబట్టి తన పార్టీ లో రమణ కూడా అదే పోస్ట్ లో ఉంటారని సాయిరెడ్డి తెలిపారు. తన మిత్రుడు రమణతో కలిసి కొత్త పార్టీ ని ముందుకు తీసుకెళతామన్నారు. కొత్త పార్టీ ప్రకటన తేదీ 11-11-2026 పై 11-11 గంటల ట్రోల్స్ పై విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించ పరిచేందుకు ఇలా పెట్టలేదన్నారు. తమకు మూహూర్త బలం అలా వచ్చిందని పండితులు చెప్పారన్నారు. ఆ ప్రకారం తాను 11-11-26 న 11గంటల ,11 నిమిషాల 11 సెకన్లకు పార్టీ ప్రకటిస్తానని తెలిపారు. ఎవరో భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేనన్నారు. ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మా పార్టీ లో చేరేందుకు సిద్దం గా ఉన్నారని, పార్టీ ఆవిర్భావం తరువాత ఈ చేరికలు ఉంటాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+