టీటీడీ ఉద్యోగులకు ఐఐటీ నిపుణులతో ఏఐపై శిక్షణ

టీటీడీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అందించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే.. అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటైన కార్యక్రమంలో రవిచంద్ర మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం ఐఐటీ, ఐసీఏఆర్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులతో ఉద్యోగులకు శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. ఏఐని విధుల్లో వినియోగించుకోవడం ద్వారా తక్కువ సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేసి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

TTD EO says all employees will be provided training in Artificial Intelligence improve their skills

టీటీడీలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన ఉద్యోగులు తమ సేవా కాలంలో ఎదుర్కొన్న అనుభవాలు, ముఖ్యమైన సంఘటనలు, విధి నిర్వహణలో అనుసరించిన పద్ధతులను ప్రస్తుత ఉద్యోగులతో పంచుకోవాలని ఈవో సూచించారు. వారి అనుభవాలు భవిష్యత్ తరాల ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తాయని, తద్వారా టీటీడీలో సేవల నాణ్యత మరింత పెరుగుతుందని అన్నారు. టీటీడీ అభివృద్ధిలో, భక్తులకు సేవలందించడంలో ఉద్యోగుల కృషి ఎంతో విలువైనదని కొనియాడారు.

ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే
ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే

కాాగా.. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు మత్స్యగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు ఉదయం 9: 30 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహిస్తారు. మొదటిరోజు ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు.

ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!
ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!

రెండో రోజున మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. చివరిరోజు 7వ తేదీన రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. భక్తులు, సిబ్బంది తెలియక చేసే పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడటానికి ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+