Actor Suman:సుమన్ సంచలన వ్యాఖ్యలు..!

తిరుపతి: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ప్రధాని మోదీ ఆ దిశగా ఆలోచించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ కోరారు. సేవ్ కవ్-సేవ్ ఎర్త్ అనే నినాదంతో హైదరాబాదు నుంచి అరుణాచలం వరకు చేపట్టిన గో మహాపాదయాత్ర తిరుపతికి చేరుకుంది. కపిలతీర్థం సమీపం నుంచి సినీనటుడు సుమన్ గోమహాపాద యాత్రకు సంఘీభావం తెలిపి అలిపిరి వరకు పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ... ఆవును రక్షిస్తే భూమిని రక్షించినవారం అవుతాం అనడంలో చాలా అర్ధం ఉందన్నారు. అన్ని వర్గాల పజల జీవితాల్లో గోవు ప్రధాన పాత్ర పోషిస్తుందనిగుర్తు చేశారు. గోవును పూజిస్తే అంతా శుభం జరుగుతుందనేది అనాదిగా వస్తున్న విశ్వాసమని చెప్పారు.వాస్తు, గ్రహ దోషాలు ఉంటే గోవుల మూలానా తొలగిపోతాయన్నారు. గో వధను తక్షణమే మానుకోవాలని ఈ సందర్భంగా సుమన్ విజ్ఞప్తి చేశారు.

Save Cow Save Earth mahapadayatra reaches Tirupati, Actor suman demands cow be made a national animal

గో మాంసం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు వెల్లడించారన్నారు. గోమూత్రం, మయంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తల్లి పాల తర్వాత గోక్షీరమే చంటిబిడ్డలకు పడ తామని గుర్తు చేశారు. ఇన్ని ఉపయోగా లున్న గోవును రక్షించాలనే భావన అందరి లోనూ ఉండాలన్నారు. విదేశాలలో గోమూ త్రాన్ని ఔషధంగా వినియోగిస్తారని, ఆవును కౌగిలించుకుంటే చర్మంపై ఉండే కనిపించని వైరస్ చనిపోతుందని, అనేక వ్యాధులు నయమవుతాయని చెప్పారు.

గో మహాపాదయాత్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ప్రజలందరి క్షేమం కోరి తాను ఈ కార్యక్ర మానికి సంఘీభావం తెలిపానని సుమన్ చెప్పారు.అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడైన బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ కలుషి తమైన ఈ భూమిని బాగుపరచాలంటే ఆవు మూత్రం, పేడ తప్పితే ప్రపంచంలో ఏ వస్తువూ ఉపయోగపడదన్నారు.

Save Cow Save Earth mahapadayatra reaches Tirupati, Actor suman demands cow be made a national animal

గోవులు అన్ని మతాలు, కులాల వారికి అవసరమని పేర్కొన్నారు. అలిపిరి కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటా మని, ఆ తర్వాత శ్రీవారిమెట్టు ద్వారా కిందకు దిగి తమిళనాడు అరుణాచలానికి పయనమవుతామని అన్నారు. ఈనెల 31న గో మహాపాదయాత్రకు ముగింపు పులుకుతామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+