Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: ఇన్‌స్టా రీల్స్ వెనుక భయంకరమైన కోణం?

విజయవాడ పోలీసులు ఛేదించిన అంతర్రాష్ట ఉగ్రవాద ముఠా కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ సామాన్య గృహిణి.. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ఆరోపించడం సంచలనంగా మారింది.

ఎవరీ సయీదా బేగం?
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల సయీదా బేగం ఓ ఒంటరి తల్లి. ఆమె తన వృద్ధాప్య తల్లిదండ్రులు, చిన్న పిల్లవాడిని పోషించుకోవడానికి ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేది. అయితే ఆమెకు సోషల్ మీడియాపై ఉన్న మక్కువతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించింది. వంటలు, టైలరింగ్ షాపుల ప్రమోషన్ల ద్వారా ఆమెకు సుమారు 38,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించే సయీదా బేగం.. ఫోన్లో మాత్రం విపరీతమైన కార్యకలాపాలు సాగించేదని పొరుగువారు చెబుతున్నారు.

Sayeeda Begum Arrest Instagram Influencer Involved in Vijayawada Terror Module Case Details

పోలీసుల ఆరోపణలు.. ఉగ్రవాదంతో సంబంధం!
విజయవాడ పోలీసులు మార్చి 23న సయీదా బేగంతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. సయీదా బేగం ఆన్‌లైన్ గ్రూపుల ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించి.. వారిని నియామకం చేసేందుకు ప్రయత్నించిందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇస్రార్ అహ్మద్, జాకీర్ నాయక్ వంటి బోధకుల వీడియోలను.. అలాగే ఐసిస్, అల్-ఖైదాకు సంబంధించిన విద్వేశపూరిత అంశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. బీహార్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని కూడా ఆమె బుట్టలో వేసుకుని.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలకు పంపేందుకు ప్రయత్నించిందని దర్యాప్తులో తేలింది.

తప్పుడు ప్రొఫైల్స్.. జిహాదీ ప్రచారం
ఏపీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సయీదా బేగం పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఆమె డజన్ల కొద్దీ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ సృష్టించి, జిహాదీ సాహిత్యాన్ని పంపిణీ చేసిందని, విదేశాల్లో ఉన్న ఉగ్రవాద హ్యాండర్ల నంబర్లను గ్రూపుల్లో షేర్ చేసిందని అధికారులు వెల్లడించారు. విజయవాడకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత అతడిచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు సయీదా బేగంను పట్టుకున్నారు. వీరంతా ఒక విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుకూర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు సమాచారం.

న్యాయవాది, కుటుంబ సభ్యుల వాదన
అయితే సయీదా బేగం తరపు న్యాయవాది అబ్దుస్ సలీం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె ఎటువంటి గ్రూపులను సృష్టించలేదని, ఎవరో ఆమెను ఆ గ్రూపుల్లో చేర్చారని, దానికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా సయీదా బేగంకు నాలుగో తరగతి వరకే చదువు ఉందని, ఆమె కేవలం తన రీల్స్ ద్వారా డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేసిందే తప్ప ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనలేదని చెబుతున్నారు. ప్రస్తుతం సయీదా బేగంతో పాటు మిగిలిన నిందితులు ఏప్రిల్ 6 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు ఈ కేసులో మరిన్ని లింకులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+