పట్టపగలే అరగంటలో బ్యాంకులో రూ.46 లక్షల దోపిడీ

వివరాల ప్రకారం.. చొప్పదండిలోని రాయపట్నం రహదారిపై నడిఒడ్డున ఎస్‌బిఐ ఉండగా శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు మేనేజర్ విశ్వేశ్వర్ రావు బ్యాంక్ చిన్న గేట్‌ను తెరిచి లోపలికి వెళ్లారు. వెంటనే ఓ యువకుడు వచ్చి రూ.3 లక్షల రూపాయలు ఖాతా నుంచి తీసుకోవాలని అడిగాడు. గంట తర్వాత రావాలని మేనేజర్ చెప్పగా వెంటనే ఆ యువకుడు రివాల్వర్ తీసి మేనేజర్‌కు గురి పెట్టాడు. బ్యాంక్‌లోని డబ్బులు ఇవ్వాలని అడిగాడు.
మరో ముగ్గురు యువకులు బ్యాంక్‌లోకి వచ్చారు. అంతలోనే క్యాషియర్లు, ఇతరులు లోపలకు వచ్చారు. వారిపై రివాల్వర్‌తో పాటు కత్తులతో బెదిరించారు. అకౌంటెంట్ గీత లోపలికి రాగానే కత్తితో ఓ యువకుడు బెదిరించాడు. వారు అరిచే ప్రయత్నం చేయగా ముగ్గురు యువకులు సిబ్బందిని చితకబాది స్టేషనరి గదిలో బంధించారు. అందరి సెల్‌షోన్లను తీసుకుని మేనేజర్‌తో లాకర్ తెరిపించి అందులోని 46 లక్షల రూపాయలను తీసుకుని అక్కడే ఉన్న గోనె సంచుల్లో వేసుకుని వెళ్లిపోయారు.
అనంతరం మేనేజర్ పోలీసులకు సమాచారాన్ని అందించగా సిఐ, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. డిఎస్పీ క్లూస్ టీంతో బ్యాంక్‌కు చేరుకుని సిసి పుటేజిలను పరిశీలించారు. కాగా నలుగురు యువకులు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉండగా హిందీలో మాట్లాడారని సిబ్బంది చెప్పారు. పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications