రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తు కేటాయింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవ్వాళ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ సంబంధించిన అంశం కావడం వల్ల దీనిపై ఉత్కంఠత నెలకొంది. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందోనంటూ ఇన్ని రోజుల పాటు ఏర్పడిన సస్పెన్స్‌కు తెర పడినట్టయింది.
రాజకీయ పార్టీలకు కేటాయించాల్సిన గుర్తులను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధి నుంచి తప్పించాలని, ఈ అధికారాన్ని రిటర్నింగ్ అధికారులకే బదలాయించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఇది. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. ఎన్నికల గుర్తులను అన్ని రాజకీయ పార్టీలు కూడా దుర్వినియోగం చేస్తోన్నాయని, దీన్ని అరికట్టాలని పిటీషన్ తరఫు న్యాయవాది వాదించారు.

ఈ గుర్తులను కేటాయించే అధికారాలన్నీ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. దీన్ని తప్పించాలని కోరారు. ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారాన్ని ఈసీ నుంచి తప్పించి- రిటర్నింగ్ అధికారికి బదలాయించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఇదొక విప్లవాత్మక మార్పునలకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల దుర్వినియోగాన్ని కూడా అరికట్టినట్టవుతుందని చెప్పారు.

ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం ఈ పిల్‌ను కొట్టేసింది. పిటీషన్ తరఫు న్యాయవాది వాదనలో బలం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దుర్వినియోగం ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకుంటుందనే విషయంపై సరైన వివరణలను గానీ, సాక్ష్యాధారాలను గానీ అందజేయలేకపోయారని పేర్కొన్నారు.

ఎన్నికల గుర్తును రాజకీయ పార్టీలకు కేటాయించే అధికారాన్ని రిటర్నింగ్ అధికారికి అప్పగించడమంటూ జరిగితే - దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందనడంపై సరైన వివరణ ఇవ్వలేకపోయారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించడం వల్ల విలువైన కోర్టు సమయం వృధా అయిందంటూ వ్యాఖ్యానించారు. కోర్టు సమయాన్ని వృథా చేసి, తమను తప్పుదారి పట్టించే పిటిషన్‌ను దాఖలు చేసినందుకు పిటిషనర్‌పై 25,000 రూపాయల జరిమానాను విధించింది












Click it and Unblock the Notifications