మార్గదర్శికి సుప్రీంకోర్టు షాక్ ?- 17 ఏళ్ల పోరులో కీలక మలుపన్న ఉండవల్లి..
ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం సీఐడీ సాయంతో సాగిస్తున్న దర్యాప్తు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలైన కేసు ఇవాళ కీలక మలుపు తిరిగింది. మార్గదర్శిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని కాంగ్రెస్ మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయపోరాటంలో కీలక మలుపు ఇది అన్నారు. కొన్నేళ్లుగా వివరాలు బయట పెట్టకుండా ఎందుకు దాస్తున్నారని సుప్రింకోర్టు ప్రశ్నించిందన్నారు. రూ.2,600 కోట్ల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయి..?డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు..? చెక్కుల రూపంలో ఇచ్చారా..? మరో రూపంలో ఇచ్చారా..? డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

మార్గదర్శి చిట్స్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఒక చోట ఉమ్మడి హిందూ కుటుంబం అని, మరో చోట ప్రొపైటరీ అని ఎందుకు రాశారని ఉండవల్లి అరుణ్ ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటీకి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మార్గదర్శి చిట్స్ పై వైసీపీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తును ఇప్పటికే స్వాగతిస్తున్న ఉండవల్లి.. ఈ కేసులో డిపాజిటర్లకు న్యాయం జరగాలనేదే తన ఉద్దేశమని కూడా పదే పదే చెప్తున్నారు.












Click it and Unblock the Notifications