కాల్వలో పడిన స్కూల్ బస్సు, విద్యార్థిని మృతి
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాక్సిల్ విరగడంతో బస్సు కాలువలోకి దూసుకు వెళ్లింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని లహరి. ఆమె వయస్సు ఏడు. ఏడో తరగతి చదువుతోంది. ఈ బస్సు విజ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందిన బస్సు.

బస్సు దుగ్గిరాల మండలం శృంగారపురం నుండి విద్యార్థులను తీసుకు వస్తుండగా నూతక్కి - కొత్తపాలెం రహదారిలో ప్రమాదవశాత్తూ తాటిచెట్టు మొద్దును ఢీకొట్టింది. బస్సులోకి దూసుకు వచ్చిన తాటిమొద్దు తగిలి విద్యార్థిని లహరి అక్కడికి అక్కడే మృతి చెందింది. అనంతరం బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.












Click it and Unblock the Notifications