దారుణం: పదో తరగతి బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని కుక్కునూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతన్న 15 ఏళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది.
మారేడు బాకలోని తన ఇంటికి వెళుతోన్న క్రమంలో ఆటోడ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, మారేడుబాక గ్రామానికి చెందిన విద్యార్ధిని స్పెషల్ క్లాస్‌కు హాజరైన అనంతరం తన స్నేహితురాళ్లతో కలిసి ఇంటికి వెళుతోంది. కివ్వాక గ్రామం వరకూ వారంతా కలిసి రాగా, ఆ తర్వాత విద్యార్ధిని ఒంటరిగా నడుస్తోంది.

ఆ సమయంలో అటువైపు ఆటోలో వెళుతోన్న ఆటో డ్రైవర్ రమేష్ బాలికను అటకాయించాడు. బలవంతంగా బాలికను ఆటోలో ఎక్కించుకుని సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారాని పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
విశాఖలో బాలికపై అత్యాచారయత్నం
విశాఖ జిల్లా మాకవర పాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. బుచ్చన్న పాలెంలో శుక్రవారం బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గట్టిగా అరుపులు, కేకలు వేస్తూ బాలిక అడ్డుకుంది. దీంతో ఆ వ్యక్తి బాలికపై దాడి చేసి చేయి విరగొట్టాడు. అనంతరం ఇంటికి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications