ఏపీలో 16 నుంచి స్కూల్క్, ఇంటర్ సెకండియర్ రెగ్యూలర్ క్లాసులు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతున్నాయి.

కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని‌ కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు.

schools and inter second year regular classes will start from august 16th in Andhra Pradesh state.

16వ తేది పాఠశాలలు ప్రారంభం రోజునే పిల్లలకి జగనన్న విద్యా కానుక అందజేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. విద్యాకానుకలో ఈసారి డిక్షనరీ కూడా ఇస్తున్నామన్నారు. 15వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మొదటి దశ నాడు-నేడును 16వ తేది ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

విద్యాశాఖలో నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామని, ఆ కారణం చేత ఏ ఒక్కరి పోస్ట్ పోదని, అదనంగా ప్రమోషన్స్ ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క పాఠశాలను మూసివేయమని, అవసరం అయితే నూతన పాఠశాలలు నిర్మిస్తామని వెల్లడించారు. గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం వైసీపీ సర్కార్ తీవ్రం కృష్టి చేస్తోందని మంత్రి చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 45 కోట్ల రూపాయల నిధులతో డోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నరగా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ క్లాసుల కంటే భౌతికంగా స్టూడెంట్స్ క్లాసులకు హాజరైతేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. విద్యా శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలను నిర్వహించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా వ్యాప్తి..

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా పెరగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు.. భారీగా తగ్గు ముఖం పట్టాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 54,455 మంది నమూనాలను పరీక్షించగా, 1413 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,83,721 కు చేరింది. ఇందులో 19,50,623 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 19,549 యాక్టివ్ కేసులున్నాయి.

ఇక, గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు,గుంటూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 13,549 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,795 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,52,47,884 రోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+