ఇంటి వద్ద దించిన ప్రియుడు: టీచర్ మృతి మిస్టరీ

బిటెక్ గ్రాడ్యుయేట్ అయిన సుప్రజ ఉప్పల్‌లోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది. ఆరు నెలలుగా ఉషా కిరణ్ అనే బోడుప్పల్ వ్యాపారిని ఆమె ప్రేమిస్తోంది. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్తున్నానని చెప్పి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లింది.
అయితే, ఆమె కిరణ్‌ను కలిసి అతని సోదరుడు ఉప్పల్‌లోని కట్టమైసమ్మ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లింది. కిరణ్ కుటుంబ సభ్యులు తల్లికి ఫోన్ చేసి, బలహీనంగా కనిపిస్తోందని, బాగా లేదని చెప్పారు. సుప్రజను కిరణ్ తన కారులో ఇంటి వద్ద దింపాడు.
ఇంట్లోకి వెళ్లిన తర్వాత తల్లిని నిమ్మరసం అడిగి, తాగింది. భోజనం చేయలేదు. నిద్రకు ఉపక్రమించింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో లేపడానికి వెళ్లింది. అయితే, సుప్రజ స్పృహలో లేదని గుర్తించింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆమె మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఓ వారంలో ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమె మృతికి సంబంధించి సుప్రజ కుటుంబ సభ్యులు ఏ విధమైన సందేహాలు వ్యక్తం చేయలేదని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications