సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి వేళ సొంత ఊర్లకు వెళ్లాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే.. వాటికి అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల రూటు.. షెడ్యూల్ ను ప్రకటించారు. రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ రైళ్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ... వెయిటింగ్ లిస్టు ఆధారంగా ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకుంటున్నారు.

సంక్రాంతి వేళ ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ మరో విడత ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసులలో రెండు రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ - కాకినాడ మార్గంలో, మిగిలిన రెండు రైళ్లు మచిలీపట్నం - వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి. రైలు (07450) కాకినాడ నుంచి జనవరి 19వ తేదీన సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది.

scr-announces-special-trains-during-sankranti-time-in-various-routes-list-is-here

రైలు (07451) వికారాబాద్‌ నుంచి జనవరి 20వ తేదీన ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అదే విధంగా రైలు (07452) నాందేడ్‌ నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. రైలు (07453) కాకినాడ నుంచి జనవరి 13న మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుందని తెలిపారు.

ఇక.. రైలు (07454) మచిలీపట్నం నుంచి జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు రాత్రి 8 గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది. కాగా.. రైలు(07455) వికారాబాద్‌ నుంచి జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 8.15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+