సికింద్రాబాద్, మచిలీపట్నం, అనకాపల్లి ప్రయాణికులకు రైల్వే శుభవార్త..!
పండుగల సీజన్ లో తెలుగు రాష్ట్రాల గూండా ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా పండుగల రద్దీ నేపథ్యంలో టికెట్లు అందక ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఉపయోగపడనుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏపీలోని అనకాపల్లి, మచిలీపట్నం వరకూ వివిధ ప్రాంతాల ప్రయాణికుల కోసం ఇవాళ ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి.
శీతాకాలం, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నడుపుతున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ఆదివారాల్లో నడుపుతున్న రైలు నంబర్ 07041 ను జనవరి 4, 11, 18 తేదీల్లోనూ పొడిగించాలని నిర్ణయించారు. అలాగే అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రతీ సోమవారం నడుపుతున్న రైలు నంబర్ 07042 ను జనవరి 5, 12, 19 తేదీల్లోనూ కొనసాగించాలని నిర్ణయించారు.

అలాగే హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ కు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07075ను జనవరి 9, 16, 23 తేదీల్లోనూ నడపాలని నిర్ణయించారు. దీంతో పాటు గోరఖ్ పూర్ నుంచి హైదరాబాద్ కు ప్రతీ ఆదివారం నడిపే ప్రత్యేక రైలు నంబర్ 07076ను కూడా జనవరి 11, 18 25 తేదీల్లో నడపాలని నిర్ణయించారు. అలాగే మచిలీపట్నం నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ కు ఈ నెల 21 నుంచి ప్రతీ ఆదివారం ప్రత్యేక రైలు నంబర్ 07274 ఉదయం 10 గంటలకు బయలుదేరి మంగళవారం 3.30కు చేరుకోనుంది. అలాగే అజ్మీర్ నుంచి మచిలీపట్నానికి ఆదివారం ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి ఉదయం 8.25కు బయలుదేరి మంగళవారం ఉదయం 9.30కు చేరుకోనుంది.

ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్ జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భాని, మాన్వత్ పార్ట్, జ సెల్భూర్, మాన్వత్, పర్భాని, మాన్వత్, పర్భాని, లాసూర్, రోటేగావ్, నాగర్‌సోల్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, మాంద్‌సోర్, నిమాచ్, చిత్తౌర్‌గఢ్, భిల్వారా, బీజైనగర్ మరియు నాసిరాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.












Click it and Unblock the Notifications