పండుగల వేళ ప్రత్యేక రైళ్లు - తిరుపతికి ఇక నుంచి..!!

తెలుగు రాష్ట్రాల్లో పండుగల వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. పండుగ రద్దీని అంచనా వేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళికి ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. అదే విధంగా సంక్రాంతికి సంబంధించి ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించారు. అటు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నెల 15న రెండు వందేభారత్ కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

దసరా, దీపావళి వేల విజయవాడ మీదుగా తిరుపతి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి - శ్రీకాకుళం రోడ్డు (07422) ప్రత్యేక వారాంతపు రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 10 వరక ప్రతీ అదివారం నడవనుంది. ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి పెరుగుతున్న రద్దీతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా శ్రీకాకుళం రోడ్డు - తిరుపి (07443) రైలు అక్టోబరు 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతీ సోమవారం నడవనుంది.

SCR announes special trains for Festive season details here

ఈ రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దవ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో అగుతుందని అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ ప్రయాణాల కోసం దక్షిణ రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు నెలల ముందే రైలు టికెట్ల రిజర్వేషన్‌ను ప్రారంభించింది. ఈ మేరకు దక్షిణ రైల్వే.. రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ను ఈ రోజు (సెప్టెంబర్ 12) నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+