హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్, దీపావళికి ప్రత్యేక రైళ్లు ఇవే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 7,823 కోట్ల ఆదాయం ఆర్జించామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. మంగళవారం రైల్ నిలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అందులో సరుకు రవాణా ద్వారా రూ.5,509 కోట్లు, ప్రయాణికుల నుంచి రూ.1,958 కోట్లు వచ్చినట్టు తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. పెద్దపల్లి -కరీంనగర్-నిజామాబాద్ కొత్త లైన్ నిర్మాణం చాలా వరకు పూర్తయిందన్నారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు మిగిలిన 28 కిలోమీటర్ల లైన్ పూర్తి కావడానికి ప్రభుత్వం రూ.141 కోట్లు విడుదల చేసిందన్నారు.

ఈ ప్రాజెక్టు మార్చి 2016నాటికి పూర్తవుతుందని చెప్పారు. మేళ్ళచెరువు-విష్ణుపురం ప్రాజెక్ట్‌కు 18 కిలోమీటర్ల పనికి రూ.100కోట్లు విడుదల చేశారని, ఇది ఫిబ్రవరి 2017 నాటికి పూర్తవుతుందన్నారు. నంద్యాల-ఎర్రగుంట్ల మధ్యన 28 కిలోమీటర్ల లైన్ పూర్తి కావడానికి 130 కోట్లు గత బడ్జెట్‌లో అలాట్ చేశారని, మార్చి 2016 నాటికి పూర్తవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. భద్రతకు ఇబ్బందులు ఉన్న 210 ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుర్తించి అందులో 414 మంది రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

మరో 224 మంది జీఆర్పీ పోలీసులు 228 ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఎస్కార్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇవికాకుండా 32 ప్రధాన స్టేషన్స్‌లో భద్రత దృష్ట్యా 431 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు 182 నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

ఎంఎంటీఎస్‌లో రైల్వే ఇంట్రాక్టివ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఫర్ ట్రావెలర్స్ అసిస్టేన్సీ (రిస్తా) మొబైల్ యాప్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. 2017నాటికి కాపలా లేని క్రాసింగ్స్ ఉండవన్నారు. గత యేడాదికాలంగా కాపలాలేని 168 లెవల్ క్రాసింగ్స్ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

దక్షిణ మధ్య రైల్వేలో 61 స్టేషన్లను ఆదర్శంగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభించామని, ఇప్పటికే 48 స్టేషన్లలో పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ -2015 వరకు) రూ.7,823 కోట్ల ఆదా యం వచ్చిందని తెలిపారు.

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

ఇది గత సంవత్సరం కన్నా 13శాతం ఎక్కువ అని తెలిపారు. కార్యక్రమంలో సీపీఆర్వో ఉమేశ్‌కుమార్, డీజీఎం శ్రీకాంత్‌రెడ్డి, ఏజీఎం ఉమేశ్‌సింగ్, చీఫ్ ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్సీ బుల్‌చందనా, కమర్షియల్ మేనేజర్ విజయభాస్కర్, జేఎన్ ఝా పాల్గొన్నారు.

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

2016 నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్

కాగా, దీపావళి పండగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దీపావళి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వారు తెలిపారు.

దీపావళికి ప్రత్యేక రైళ్లు

దీపావళికి ప్రత్యేక రైళ్లు

4వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి- సికింద్రాబాద్ సూపర్ ఫాస్టు రైలు
7వ తేదీ రాత్రి 7.15 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి సూపర్ ఫాస్టు రైలు
5వ తేదీ రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్-కాకినాడ

దీపావళికి ప్రత్యేక రైళ్లు

దీపావళికి ప్రత్యేక రైళ్లు

6వ తేదీ రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్- సికింద్రాబాద్
5వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు కాకినాడపోర్టు- సికింద్రాబాద్
6వ తేదీ రాత్రి 7.15 గంటలకు సికింద్రాబాద్-కాకినాడ పోర్టు
7వ తేదీ రాత్రి 9.05 గంటలకు కాకినాడ పోర్టు- తిరుపతికి ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి.

English summary
Finding passenger traffic bursting at its seams at the existing Secunderabad railway station, the South Central Railway (SCR) authorities are contemplating developing another terminal in and around the city, which can accommodate six to seven platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X