ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దసరా, దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

- ఈ క్రమంలో తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. మహారాష్ట్రలోని నాందెడ్ నుంచి తిరుచానూర్/తిరుపతి వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
- ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 6:50 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07039 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు తిరుచానూర్ కు చేరుకుంటుంది.
- నేటి నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 6:40 నిమిషాలకు తిరుచానూర్ నుంచి బయలుదేరే నంబర్ 07040 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు నాందెడ్ కు చేరుకుంటుంది.
- ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, లింగంపేట్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.












Click it and Unblock the Notifications