పొత్తుల్లో మారిన సీట్ల లెక్క, ఢిల్లీ ఎఫెక్ట్ - ఎవరికెన్ని, తుది జాబితా సిద్దం..!!

ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది. టీడీపీ,బీజేపీ, జనసేన మధ్య పొత్తు పైన అధికారికంగా ప్రకటన రానుంది. సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్లు పైన మూడు పార్టీల మధ్య అనేక ప్రతిపాదనలు..చర్చల తరువాత దాదాపు ఫైనల్ జాబితా సిద్దం చేసారు. గతంలో ప్రతిపాదించిన లెక్కలు మారాయి. ప్రధానంగా టీడీపీ, జనసేనలో ఆశావాహులు త్యాగాలు తప్పేలా లేవు. ఢిల్లీలో తుది చర్చలు.. పొత్తు ప్రకటన లాంఛనమే.

మారుతున్న లెక్కలు:ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరిక ఖాయమైంది. రెండు రోజుల్లోనే పొత్తుపైన అధికారిక ప్రకటన రానుంది. రేపు ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారు. బీజేపీ నేతలతో పొత్తుల పైన తుది చర్చల తరువాత చంద్రబాబు ఫైనల్ గా సీట్ల ఖరారు పైన నిర్ణయం వెల్లడించనున్నారు.

Seat Sharing between TDP-BJP-Janasena almost finalised, to be announce officially

గతంలో జనసేనకు 25-28 సీట్లను ప్రస్తుతం 30 వరకు ఇవ్వాల్సిందేననే పవన్ ఒత్తిడికి చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. జనసేనకు 30 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో పవన్ వెల్లడించారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుందని...తానే వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు పవన్ వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల అంశం పైన ప్రాధమికంగా నిర్ణయం జరిగింది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు:పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేకు కేటాయించారు. విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, తిరుపతి స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అసెంబ్లీ స్థానాల్లో 2014లో పొత్తులో భాగంగా 13 సీట్లు బీజేపీకి కేటాయించారు.

ఇప్పుడు 12 స్థానాలు ఖరారైనట్లు తెలుస్తోంది. అందులో గతంలో కేటాయించిన స్థానాల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఇక..బీజేపీకి కేటాయించే సీట్ల పైన తాజాగా ఆ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగా సాగుతోంది. ప్రాధమికంగా ఆ సీట్ల సంఖ్య పైన డిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు తమ నిర్ణయం వెల్లడించనున్నారు. రేపు దీని పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ప్రకటనకు సిద్దం:ఇక, విశాఖ - గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ ముందుగానే తమ అభ్యర్దులను ఖాయం చేసారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో పెందుర్తి, భీమిలి, గాజువాక, యలమంచిలికి ఇంఛార్జ్ లను ప్రకటించారు. పొత్తు ఖాయం అయిన తరువాత అధికారికంగా ఈ సీట్ల పైన ప్రకటన చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరిలో గతంలోనే రాజోలు, రాజానగరం ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని సైతం జనసేన పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చారు.

అయితే, సీట్లు రాని వారు త్యాగాలకు సిద్దం కావాలని..ప్రభుత్వం ఏర్పడిన తరువాత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలతో తుది చర్చల అనంతరం..మూడు పార్టీల కూటమి పోటీ- సీట్ల అంశం పైన అధికారికంగా ప్రకటన రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+