కూటమి Vs జగన్, ఏపీలో కీలక ఎన్నికల సమరం - సెమీ ఫైనల్స్..!!

ఏపీ రాజకీయాల్లో కీలక సమరం. కూటమి Vs జగన్. ఎవరి సత్తా ఏంటో మరోసారి నిరూపించుకునే పోరు కు రంగం సిద్దం అవుతోంది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన జగన్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. కూటమి తిరిగి తమ సత్తా నిరూపించాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ ఎన్నికల తరువాత ఏపీలో ప్రజల ఓటింగ్ తో జరిగే ఎన్నికలు దాదాపు లేనట్లే. కాగా, ఇవి 2029 ఎన్నికల కు ముందు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. దీంతో.. ఎవరి బలం ఏంటో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది.

ఏపీలో మరో ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పురపాలక, పంచా యతీరాజ్‌ శాఖలకు వేర్వేరుగా లేఖలు రాసింది. వచ్చే ఏడాది మార్చి 17కి మున్సిపల్‌ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనుంది. ముందుగా పంచాయతీల అప్‌గ్రేడేషన్‌, సమీపంలో ఉన్న పంచాయతీల ను మున్సిపల్‌ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్‌ ఎన్నికల్లో 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17 నాటికి ముగుస్తుంది.స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది.

SEC and AP Govt making action plan for local body Elections in the state

తాజాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవుగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ నెల 19న టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు. మూణ్నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతోందన్న విషయం స్పష్టం అవుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

తాజా అంచనాల మేరకు ఏప్రిల్‌లో మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికలకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి అదనం గా దాదాపు లక్ష బ్యాలట్‌ బాక్సులు తెప్పించాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. గత ఎన్నికల సమయంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.20 లక్షల బ్యాలట్‌ బాక్సులు ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అదనపు బాక్సులు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఇక.. ప్రభుత్వం పైన వ్యతిరేక పెరిగింది అని పదే పదే చెబుతున్న జగన్ కు ఈ ఎన్నికల్లో బలం నిరూపించుకోవటం కీలకంగా మారుతోంది. అదే సమయంలో కూటమి సైతం తమ పట్టు మరో సారి స్పష్టం చేసుకునే వ్యూహాలను ఇప్పటికే అమలు చేస్తోంది. దీంతో.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రాజకీయంగా కసరత్తు మొదలు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+