Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మరో ఎన్నికల సమరం, షెడ్యూల్ - జగన్ Vs కూటమి.. కీలక మలుపు..!!

ఏపీలో మరో రాజకీయ సమరం జరగనుంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తరువాత ఈ సారి జరిగే ఎన్నికలు ఎన్డీఏ - జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ ఆదరణ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెబుతున్న జగన్ కు తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఈ ఎన్నికల పైన కసరత్తు మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది.

సమరానికి సై
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది మార్చి17కి మున్సిపల్‌ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్నందున ముందుగా ఎన్నికలకు సిద్దంకావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ ప్రభుత్వానికి లేఖ రాసారు. ఎన్నికల సన్నాహాల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ముందుగా పంచాయతీల అప్‌గ్రేడేషన్‌, సమీపంలో ఉన్న పంచాయతీల ను మున్సిపల్‌ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్‌ ఎన్నికల్లో 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17 నాటికి ముగియనుందని వివరించారు.

sec-letter-to-ap-govt-over-preparations-for-local-body-elections-details-here

కార్యాచరణ
అదే విధంగా రెండో విడతలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు /నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్‌ 2021లో జరిగాయి. ఈ 13 స్థానికసంస్థలకు వచ్చే ఏడాది నవంబర్‌ 21కు గడువు ముగుస్తుందని తెలిపారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2017 ఆగస్టు-సెప్టెంబరులో ఎన్నికలు జరిగాయని, 2022 సెప్టెంబరుకు వాటి గడువు ముగిసిందని పేర్కొన్నారు. మిగిలిన శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లితో పాటు 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955 ప్రకారం సాధారణ స్థానికసంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే మూడు నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసారు. దీంతో, డీలిమిటేషన్‌, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబరు 15లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

షెడ్యూల్ ఇలా
ఇక, కసరత్తులో భాగంగా వార్డులవారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోపు ఈ సన్నాహాలు పూర్తిచేయాలని సూచించారు. నవంబరు 1 నుంచి 15దాకా రిటర్నింగ్‌ అధికారులను నియమించుకోవాలని కోరారు. నవంబరు 16 నుంచి పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్దం చేయాలని స్పష్ట చేసారు. నవంబరు 30 లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేసి... రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబరు 15 లోగా పూర్తి కావాలని సూచించారు. డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతోను, సీనియర్‌ అధికారులతోను సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. జనవరి 2026 లోపు ఎన్నికలు నిర్వహించాలని... అదే విధంగా 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ/జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్నీ స్పష్టం చేసారు. దీంతో.. ఈ ఎన్నికలు కూటమి - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+