Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేను , సమయం లేదు : తేల్చేసిన ఎస్ఈసి నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చేశారు . తన పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తి అవుతుందని, బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. అంతేకాదు పెరుగుతున్న కరోనా కేసులతో, కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో వెంటనే నిర్వహించలేమని చెప్పారు.

ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ

ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ

ఏపీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నదానిపై రోజురోజుకు ఉత్కంఠ నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు కూడా నిర్వహించాలని అధికార పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఒత్తిడి తెస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించటాన్ని వ్యతిరేకించిన జగన్ సర్కార్ పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించటంతో అదే ఊపులో ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చెయ్యాలని భావిస్తుంది .

తాను ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేనని చెప్పిన నిమ్మగడ్డ

తాను ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేనని చెప్పిన నిమ్మగడ్డ

ఇక తాజాగా హైకోర్టు పరిషత్ ఎన్నికలు నిర్వహించడ పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఎన్నికలను జరపమని ఆదేశించలేమని స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తన హయాంలో ఈ ఎన్నికలు జరగబోవని నిమ్మగడ్డ తేల్చి చెప్పేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ తాను ఇవ్వలేను అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తను జడ్పిటిసి ,ఎంపిటిసి ఎన్నికల కు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ను విడుదల చేయలేనని ఆయన వెల్లడించారు.

ఏకగ్రీవాలు , బెదిరింపులపై ఫిర్యాదు చేసుకోవచ్చు

ఏకగ్రీవాలు , బెదిరింపులపై ఫిర్యాదు చేసుకోవచ్చు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలు జరిగినచోట ఏవైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసుకోవచ్చు అన్నారు. ఇక నామినేషన్లు వేయడంలో ఇబ్బంది ఎదుర్కొన్న వారు, బెదిరింపులు , దౌర్జన్యాలు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేక పోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని, రిటర్నింగ్ అధికారులు వీటిపై విచారణ చేస్తారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ఆదేశాలను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.

తన హయాంలో జరిగిన ఎన్నికల్లో అధికారులు , పోలీసులు చాలా శ్రమించారన్న ఎస్ఈసి

తన హయాంలో జరిగిన ఎన్నికల్లో అధికారులు , పోలీసులు చాలా శ్రమించారన్న ఎస్ఈసి


ఇక ఇప్పటి వరకు తన హయాంలో నిర్వహించిన ఎన్నికల విషయంలో పోలీసులు మరియు అధికార యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేసిందని కితాబిచ్చారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో అందరూ సహకరించారని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని, పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని పేర్కొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘం అవలంబించిన విధానాలను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగించాలని ఆయన అన్నారు.

 తనకు ఎన్నికల నిర్వహణకు సమయం లేదని స్పష్టంగా చెప్పిన నిమ్మగడ్డ

తనకు ఎన్నికల నిర్వహణకు సమయం లేదని స్పష్టంగా చెప్పిన నిమ్మగడ్డ


ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ , మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్ణయించుకున్నామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. తనకు ఎన్నికల నిర్వహణకు సమయం లేదని హైకోర్టు ఆదేశాల మేరకు, షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, నాలుగు వారాల పాటు ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతను కూడా నెరవేర్చలేనని, నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భుజస్కంధాలపై బాధ్యతలన్నీ ఉంటాయని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.


మొత్తానికి తాను ఈ ఎన్నికలు జరపలేనని చెప్పేశారు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+