పులివెందులలో రీ పోలింగ్ వేళ జగన్ అనూహ్య నిర్ణయం..!!
పులివెందుల కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ - వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ రోజున ఉదయం నుంచి ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమను ఓట్లు వేసే అవకాశం ఇవ్వటం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. పులివెందుల పరిణామాల పైన జగన్ సీరియస్ అయ్యారు. ఇటు ఎన్నికల సంఘం రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ కు ఆదేశించింది. కాగా, రీపోలింగ్ వేళ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ - వైసీపీ పార్టీలు హోరా హోరీగా తలపడిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలు ఉద్రిక్తల మధ్య పోలింగ్ ముగిసింది. కానీ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆ చోట్ల రీపోలింగ్ జరుగుతుంది. 3, 14 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదుతో ఈసీ రీపోలింగ్‌కి ఆదేశించింది. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

అయితే, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాల పైన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. రెండు జెడ్పీటీసీ సీట్ల కోసం దిగజారి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని విమర్శించారు. బ్లాక్ డేగా అభివర్ణించారు. ఇక..ఈ రోజు జరుగుతున్న రీ పోలింగ్ ను బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. అటు పులివెందులలో ఎన్నిక పైన వైసీపీ సుప్రింకోర్టును ఆశ్రయించింది.
రేపటి కౌంటింగ్ ను వాయిదా వేసి... కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి ఎన్నిక నిర్విహించాలని కోరింది. ఈ రోజు సుప్రీం విచారణ చేయనుంది. కాగా, పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైంది. రేపు కౌంటింగ్ జరగనుండడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ రెండు స్థానాలను వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications