'తల్లికి వందనం' రెండో జాబితా, కొత్తగా వీరికీ ఛాన్స్ - చెక్ చేసుకోండి, ఫైనల్..!!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం కింద లబ్దిదారులకు నిధులు విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం అమలు చేస్తోంది. కాగా, కొత్త బడుల్లో చేరుతున్న వారికి అవకాశం కల్పిస్తూ తాజా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ రోజు వరకు కొత్తగా పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే వారికి ఈ పథకం అమలు చేయనున్నారు. ఇక.. రెండో జాబితా ఇప్పటికే సచివాలయాలకు చేరింది.

ప్రభుత్వం తల్లికి వందనం పథకం పై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మ కంగా అమలు చేస్తోంది. అర్హులై ఉండీ పథకం అమలు కాని వారి నుంచి ఫిర్యాదులు తీసుకొని పరిష్కారం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వార్డు - గ్రామ సచివాలయాలకు లబ్దిదారుల నుంచి వచ్చిన అభ్యర్ధనల పైన పరిశీలన జరుగుతోంది. కాగా. ఇవాళ సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తొలి విడతలో డబ్బులు జమ కానివారు, ఒకటో తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ఈ నెల 5న ఖాతాల్లో డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

second-list-of-thalli-ki-vandanam-beneficiaries-available-in-ward-and-village-secretariats

ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ రోజు సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఈ పథకం కింద డబ్బులు అందనున్నాయి. ఇక, సెకండ్‌ ఫేజ్‌లో మీ పేరు ఉందో తెలుసుకోవడానికి https://gsws-nbm.ap.gov.in/ సంప్రదించాలి. రెండో విడత లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో, లేదో రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు చెక్ చేయాలంటే..ప్రభుత్వ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ ఓపెన్ చేయాలి.. తల్లికి వందనం పథకాన్ని సెలక్ట్ చేసుకుని.. విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా, కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ +91 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+