పవన్ , బీజేపీ నేత రామ్ మాధవ్ ల రహస్య భేటీ .. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించలేకున్నా జనసేనాని మాత్రం పట్టిన పట్టు విడవకుండా రాజకీయాల్లోనే ఉంటూ జనసేన పార్టీని నడిపిస్తానని అంటున్నారు. అయితే తాజాగా అనూహ్యంగా జరిగిన ఓ సంఘటన పవన్ పార్టీని కొనసాగిస్తారా లేకా అన్న తరహాలో విలీనం చేస్తారా అన్న అనుమానాలు రేకెత్తించింది. అయితే అదేమీ లేదని ఊపిరి ఉన్నంతవరకు పార్టీని కొనసాగిస్తానని పవన్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

తానా సభల సాక్షిగా పవన్, బీజేపీ నేత రామ్ మాధవ్ ల భేటీ ..
అమెరికాలో తానా వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలు భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది . ప్రస్తుతం అమెరికాలో తానా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు పలువురు రాజకీయ నేతలను కూడా ఆహ్వానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో ఇద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ నేత రాం మాధవ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అన్న చర్చ సాగింది.

భేటీ అనంతరం స్పందించిన రామ్ మాధవ్ .. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ప్రకటన
పవన్‌తో చర్చల అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పనిచేసే ఉద్దేశం లేదన్నారు. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ను స్నేహపూర్వకంగానే కలిశానన్నారు రాంమాధవ్, తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయశక్తిగా ఎదగడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు . అయితే ఇటీవలే చిరంజీవి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో తాజాగా రాంమాధవ్ కూడా పవన్ కళ్యాణ్‌తో భేటీ అవ్వడం రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

భేటీపై సందించిన పవన్ కళ్యాణ్.. పాత పరిచయంతోనే కలిశానన్న రామ్ మాధవ్
తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరుతున్న ప్రస్తుత తరుణంలో వీళ్లిద్దరి మధ్య జరిగిన భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా రకరకాల చర్చలకు కారణం అయ్యింది .అయితే, ఇదే విషయమై స్పందించిన పవన్ కళ్యాణ్ కేవలం వారి కలయిక పాత పరిచయాల నేపధ్యంలోనే సాగిందని చెప్పారు. తాను రామ్ మాధవ్‌ని కలవడంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఆయనకు, తనకు మధ్య వున్న పాత పరిచయంతోనే రామ్ మాధవ్‌ను కలిశానని, అంతకుమించి దీనివెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని తేల్చిచెప్పారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేకహోదా గురించి ప్రశ్నించేందుకే కలిశానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌తో భేటీలో స్నేహాపూర్వక భేటీ మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నా ఈ భేటీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు నాందిగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications