అలిపిరితో పాటు తిరుమలలో

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు దర్శనం, సేవలు, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలతో పాటు కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 80 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 394 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.

అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలిపిరి వద్ద ఏడు ఏడు 7 కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ 46 మంది సిబ్బంది మూడు షిఫ్ట్ లల్లో పని చేస్తోన్నారు. ఒకేసారి 10,194 లగేజీలను డిపాజిట్ చేయవచ్చు. శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ 3,025 లగేజీలను డిపాజిట్ చేయవచ్చు. ఆయా కౌంటర్లల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.

Securely Deposit Your Luggage for Tirumala Darshan at 80 Counters along Alipiri and Srivari Mettu

తిరుమలలో.. ఫ్రీ హాల్- 10, వైకుంఠం క్యూకాంప్లెక్స్- 2 కౌంటర్లు, నారాయణగిరి షెడ్ - 8, డీడీ హాల్- 3, రూ.300 హాల్- 5, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అప్ స్కానింగ్- 2 అందుబాటులో ఉన్నాయి. మూడు షిఫ్టుల్లో ఇక్కడ సిబ్బంది విధి నిర్వహణలో ఉంటోన్నారు. తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటయ్యాయి. కేకేసీ 1, 2, 3- 3 కౌంటర్లు ఉన్నాయి. సుపథం కౌంటర్, సీనియర్ సిటిజన్ / దివ్యాంగులు, వాక్యూసి-1 మెయిన్ గేట్ వద్ద ఒక్కో లగేజీ కౌంటర్ అందుబాటులో ఉంది.

డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు పలుచోట్ల డెలివరీ కేంద్రాలు ఉన్నాయి. జీఎన్సీ వద్ద అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ- 5, శ్రీవారి మెట్టు, పీఏసీ-4, 1- 4 కేంద్రాలు- 16 కౌంటర్లు, 4, 5, 7, 8 కేంద్రాల వద్ద నాలుగు చొప్పున లగేజీ డెలివరీ కౌంటర్లలను టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేటర్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు.

ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి వెంటనే లగేజీని భక్తులకు అందిస్తారు. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 10,44,268 డిపాజిట్లు న‌మోద‌య్యాయి. ఇక్క రథసప్తమి నాడే అత్య‌ధికంగా 1,34,749 డిపాజిట్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+