Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం - మహాద్వారం వద్ద...!!

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు రేపు (ఆదివారం) అంకురార్పణ జరగనుంది. 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇదే సమయంలో శ్రీవారి ఆలయం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఆలయ మహాద్వారం వద్ద మహారాష్ట్రకు చెందిన భక్తులు సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకున్నట్లు గుర్తించారు.

తిరుమలలో ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి దివ్య‌మైన ఆశీస్సుల‌ను భ‌క్తులంద‌రికీ అందించేందుకు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను టీటీడీ నిర్వ‌హిస్తుంది. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. భ‌క్తులంద‌రికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Security breach in Tirumala, Devotee entered with mobile in temple premisis

ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఆలయ మహాద్వారం వద్ద మహారాష్ట్రకు చెందిన భక్తులు సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకున్నారు. అయినప్పటికీ టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోని పరిస్థితి. ఆలయం వెలుపలికి వచ్చిన సమయంలో సెల్‌ఫోన్ ఎక్కడిదంటూ భక్తులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమ డ్రైవర్ సెల్‌ఫోన్ ఇవ్వడంతో ఫోటోలు తీసుకున్నామని భక్తులు చెప్పారు. అయితే భక్తులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడాన్ని చూసి.. భక్తుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాగా.. శ్రీవారి ఆలయం వద్ద భద్రతా వైఫల్యం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఒక భక్తుడు సెల్ ఫోన్ ను ఆనంద నిలయం వరకు తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సంఘటన సంచలనంగా మారింది. ఆ తరువాత ఆ భక్తుడిని గుర్తించారు. ఇప్పుడు అదే తరహాలో మరో భక్తుడు మొబైల్ తో ఆలయం ప్రాంగణంలోకి వచ్చినట్లు గుర్తించారు. తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి. క్యూ లైన్ల వద్ద భక్తుడిని క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తారు. మరి అక్కడ కూడా సెల్ ఫోన్ ను గుర్తించలేదనే అంశం పైన విచారణ జరుగుతోంది. సెప్టెంబర్ 18వ తేదీ సోమ‌వారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+