Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ,సికింద్రాబాద్ లతో సహా ఆ రైల్వేస్టేషన్లలో..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో అప్రమత్తమైన భద్రతా సంస్థలు విస్తృత తనిఖీలు చేపట్టాయి ఈ ఘటన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకు హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా జన సమర్థం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

ఏపీ, తెలంగాణాలలో భారీ సెర్చ్ ఆపరేషన్
అనుమానాస్పద వస్తువులు లేదా వాహనాలు లేదా వ్యక్తుల పైన ప్రత్యేక దృష్టి సారించాలని అలర్ట్ చేయడంతో పోలీసులు ప్రతిచోట పటిష్టంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భారీగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలను చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలను చేపట్టాయి.

Security forces are combing those railway stations including Secunderabad and Vijayawada

సికింద్రాబాద్, వరంగల్ రైల్వే స్టేషన్ లలో తనిఖీలు
అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద కూడా అదనపు సిబ్బందిని నియమించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో వరంగల్ రైల్వేస్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ​

అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ
వరంగల్ జీఅర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలను చేపట్టారు. సీఐ సురేందర్ నేతృత్వంలో స్టేషన్‌లో ప్రతి మూలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ​ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీ చేసి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు కాజీపేట రైల్వే స్టేషన్ లోనూ జిఆర్పి, ఆర్పిఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.ప్రయాణికుల వెంట ఉన్న లగేజీ బ్యాగులు, పార్సిళ్లను మెటల్ డిటెక్టర్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ​

విజయవాడ, విశాఖ, తిరుపతి స్టేషన్ల లోనూ విస్తృత తనిఖీలు
ముఖ్యంగా రైళ్లు రాకపోకలు సాగించే సమయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాగా రద్దీగా ఉండే ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జీలలో కూడా పోలీసులు సోదాలను నిర్వహిస్తున్నారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా తనిఖీలను చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+