మరీ ఇలానా?.. భద్రత వట్టి డొల్ల.. అధికారులు ఏం చేస్తున్నట్లు?
జరిగిన ఘటనను బట్టి సచివాలయం చుట్టు పక్కల రాకపోకలపై నిఘా కొరవడిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వెలగపూడి: ఈమధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని పలుమార్లు కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ఇంటలిజెన్స్ ను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం నివాసం వద్దకు సైతం విలేకరుల రూపంలో వచ్చిన మావోయిస్టులు రెక్కీ నిర్వహించి వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇంత జరుగుతున్నా.. భద్రతా విషయంలో సిబ్బంధి తీరు మాత్రం మారడం లేదు. తాజాగా వెలగపూడిలోని సచివాలయంలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఏకంగా ఓ బయటి వ్యక్తి తన గుర్రంతో సచివాలయానికి వచ్చి.. దాన్ని అటు ఇటూ దౌడు తీయించాడు. ఈ దృశ్యాలను పలు టీవీ చానెళ్లు సైతం ప్రసారం చేశాయి.

ఆలస్యంగా విషయాన్ని గమనించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. జరిగిన ఘటనను బట్టి సచివాలయం చుట్టు పక్కల రాకపోకలపై నిఘా కొరవడిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications