పవన్‌కు భద్రత పెంపు: బాబును ఢీకొట్టేందుకు.. జనసేన డిజిటల్ వింగ్ షాకింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భద్రత పెంచారు. అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది.

ఈ విమర్శలకు కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఊహించే పవన్ మంగళవారం డీజీపికి భద్రత పెంపుపై లేఖ రాశారు.

దీంతో ఆయన బస చేసిన హోటల్ దగ్గర భద్రతను ఎత్తున పెంచారు. ఆ లేఖ పర్యావసనమే భద్రత పెరగడానికి కారణమని అంటున్నారు.

Security to Pawan Kalyan

జనసేన పార్టీ డిజిటల్ విభాగం చేసిన ట్వీట్ కూడా భద్రత పెంపుపై మరింత స్పష్టత ఇస్తోంది. ఆ ట్వీట్‌లో... రాష్ట్రంలో దేశంలో అనేక వ్యవస్థలు చేతిలో ఉన్న చంద్రబాబుని ఢీకొనటానికి పవన్ సిద్ధపడ్డారని, మీడియా అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వాన్ని హననం చేయవచ్చునని, వేరే ఇతర వ్యవస్థలను దుర్వినియోగపరిచి ఏమైనా చేయవచ్చునని, పవన్ బలం, బలగం మనమేనని, కాబట్టి అనుక్షణం వేకువతో అందరూ జాగ్రత్తతో ఉండాలని ట్వీట్ చేసింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఆరోపణల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు రోడ్ల పైకి వచ్చాయి. పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ పవన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Security to Pawan Kalyan after his attack on Chandrababu Naidu government and Telugudesm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి