వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్ర‌జ‌లు ఓటేసేలా చూడండి..! అదికారుల‌కు ద్వివేదీ ఆదేశాలు..!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఎన్నికల నియమావళిని అధికారులందరూ తప్పక పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం వెలగపూడి నుంచి రాష్టానికి సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ గా నియమింపబడిన కె.కె శర్మ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్లతో ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జిల్లా పోలీస్ అబ్జర్వర్ అతుల్ వర్మ, ఐపీఎస్ , కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ రూపక్ కె.ఆర్.మజుందార్, నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ వినీత్ కుమార్, రాయలసీమ డీఐజీ నాగేంద్ర కుమార్, ఎస్పీ పక్కీరప్ప, జిల్లాకు వచ్చిన ఎన్నికల అబ్జర్వర్లు పాల్గొన్నారు.

<strong>ఎన్నిక‌ల నిభంధ‌న‌ల‌కు పాత‌ర‌..! తెలంగాణ‌లో య‌ధేచ్చ‌గా ఏక‌గ్రీవ తీర్మాణాల జాత‌ర‌..!!</strong>ఎన్నిక‌ల నిభంధ‌న‌ల‌కు పాత‌ర‌..! తెలంగాణ‌లో య‌ధేచ్చ‌గా ఏక‌గ్రీవ తీర్మాణాల జాత‌ర‌..!!

ఎన్నికల నియమావళిని విధిగా పాటించండి..! అదికారులు ప్ర‌చారంలో పాల్గొంటే క‌ఠిన చ‌ర్య‌లు..!!

ఎన్నికల నియమావళిని విధిగా పాటించండి..! అదికారులు ప్ర‌చారంలో పాల్గొంటే క‌ఠిన చ‌ర్య‌లు..!!

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు స్వేచ్ఛగా తన ఓటును వేసేలా అధికారులు ఎన్నికల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల్లో తగినంత పోలీస్ బలగాలను నియమించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలన్నారు. పెయిడ్ న్యూస్, ప్రకటనలు, సోషల్ మీడియా కు సంబందించిన వాటిపై ఎంసిసి కమిటీ ఎప్పటికప్పుడు నోటీసులను జారీచేయాలన్నారు.

 ప్ర‌తి ఓట‌రు స్వేచ్చ‌గా ఓటేయాలి..! అయోమ‌యానికి తావివ్వొద్ద‌న్న ద్వివేదీ..!!

ప్ర‌తి ఓట‌రు స్వేచ్చ‌గా ఓటేయాలి..! అయోమ‌యానికి తావివ్వొద్ద‌న్న ద్వివేదీ..!!

ఎంసీసీ, సెక్టోరల్ అధికారులు, ఎస్ ఎస్ టి , ఇన్కమ్ టాక్స్, ఆబ్కారీ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ లాంటి అన్ని కమిటీలు భాద్యతాయుతంగా పనిచేయాలన్నారు. అబ్జర్వర్ల సమక్షంలో ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ ను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ...జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్ సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. 300 క్రిటికల్, 30 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

 5వ తారీఖులోపు ఓట‌రు స్లిప్పులు పంచండి..! ర‌వాణా సౌక‌ర్యం కోసం అదికారుల క‌స‌ర‌త్తు..!!

5వ తారీఖులోపు ఓట‌రు స్లిప్పులు పంచండి..! ర‌వాణా సౌక‌ర్యం కోసం అదికారుల క‌స‌ర‌త్తు..!!

1950 కాల్ సెంటర్ నుంచి 17,536 , సి-విజిల్ ద్వారా 401 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. పోలింగ్ సామగ్రిని తరలించేందుకు 780 బస్సులు అవసరమౌతాయని, ఇందులో 430 ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన బస్సులను త్వరలో సిద్ధం చేసుకుంటామన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ ను ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. ఎస్పీ పక్కిరప్ప మాట్లాడుతూ...ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు ఉంటాయి..! చెక్ పోస్టుల‌ను క‌ట్టుదిట్టం చేసిన ఈసి..!!

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు ఉంటాయి..! చెక్ పోస్టుల‌ను క‌ట్టుదిట్టం చేసిన ఈసి..!!

ఇప్పటికే అక్రమ మద్యం, నగదు, గోల్డ్, సిల్వర్ ను పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచామన్నారు. చెక్ పోస్టులందు సీసీ కెమెరాలను వాడుతామన్నారు. జిల్లా పోలీస్ అబ్జర్వర్ అతుల్ వర్మ, కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ రూపక్ కె.ఆర్.మజుందార్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై తాము గమనించిన విషయాలను తెలియ చేశారు.

English summary
State Chief Electoral Officer, Gopala Krishna Dwivedi said that all the officers should observe the election code set by the Election Commission of India. Dwivedi appointed as the Observer States to the Central Police District together with KK Sharma, SP, The Observer, he held a video conference on the management of the election, in Velagapudi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X